Site icon HashtagU Telugu

TDP in camera :చంద్ర‌బాబు కుర్చీలో నేడు బాల‌య్య! నాడు దేవేంద‌ర్ గౌడ్!!

Tdp In Camera

Tdp In Camera

TDP in camera : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బామ్మ‌ర్ధి, హిందూపురం ఎమ్మెల్యే బాల‌క్రిష్ణ పార్టీ కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఆ సంద‌ర్భంగా చంద్ర‌బాబు కుర్చీలో ఆయ‌న కూర్చుకున్నారు. దీంతో పార్టీలో ఏమి జ‌రుగుతుంది? అనే చ‌ర్చ మొద‌ల‌యింది. పైగా టీడీపీలోని కోర్ టీమ్ చంద్ర‌బాబు రివ్యూ మీటింగ్ లో క‌నిపించారు. సోమ‌వారం జ‌రిగిన ఆ స‌మావేశంలో చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌డంపై చ‌ర్చించారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్టీ క్యాడ‌ర్ కు ధైర్యం నింపాల‌ని నిర్ణ‌యించారు. అందుకే, మంగ‌ళ‌వారం మీడియా ముందుకు బాల‌క్రిష్ణ వ‌చ్చారు. `నేను ఉన్నా..న‌డిపిస్తా, ధైర్యంగా ఉండండి` అంటూ వెల్ల‌డించారు.

చంద్ర‌బాబు కుర్చీలో బాల‌య్య (TDP in camera)

ప్ర‌స్తుతం టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ రాజ‌మండ్రి  (TDP in camera)వ‌ద్ద ఉన్నారు. ఆయ‌న యువ‌గ‌ళాన్ని తాత్కాలికంగా ఆపేశారు. తండ్రి చంద్ర‌బాబు కేసుకు సంబంధించిన అంశాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. జైలులోని ప‌రిస్థితులు, చంద్ర‌బాబు ఆరోగ్యం త‌దిత‌రాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నారు. కేసులోని లోతుపాతుల‌ను మీడియాకు వివ‌రిస్తున్నారు. నీతి వంతమైన రాజ‌కీయాలు చేసిన చంద్ర‌బాబును బ‌ద్నాం చేయ‌డానికి కేసులు పెట్టార‌ని చెబుతున్నారు. ప్ర‌జ‌ల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు.

ప్ర‌జ‌ల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్ల‌కుండా

వాస్త‌వంగా చంద్ర‌బాబు అరెస్ట్ ను రెండు కోణాల నుంచి చూడొచ్చు. ఒక‌టి క్రిమిన‌ల్ యాంగిల్ , రెండు పొలిటిక‌ల్ యాంగిల్ లో చూడాలి. క్రిమిన‌ల్ యాంగిల్ అనేది న్యాయ‌స్థానం చూస్తోంది. దాని కంటే ప్ర‌జాక్షేత్రంలో చంద్ర‌బాబు నిజాయితీప‌రునిగా నిల‌ప‌డం ముఖ్యం. అందుకే, పొలిటిక‌ల్ యాంగిల్ లో ఏ మాత్రం న‌ష్టం జ‌ర‌గ‌కుండా లోకేష్ ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా ముందుకొస్తూ వైసీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొడుతున్నారు. ఇదే స‌మ‌యంలో పార్టీ క్యాడ‌ర్ ను కాపాడుకోవ‌డం కూడా ముఖ్యం.

కుర్చీని అప్ప‌ట్లో దేవంద‌ర్ గౌడ్ అలంక‌రించ‌డం

ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు అన్నీతానై పార్టీని న‌డిపించారు. కీల‌క లీడ‌ర్లు కూడా సొంతంగా నిర్ణ‌యాలు తీసుకునే అల‌వాటు లేదు. పొలిట్ బ్యూరో ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయ‌డం వ‌ర‌కు పరిమితం. ఆయ‌న నీడ‌న ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని న‌డుపుతూ వ‌చ్చారు. అక‌స్మాత్తుగా చంద్ర‌బాబు (TDP in camera) జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. అందుకే, బాల‌య్య ముందుకు దూకారు. లీడ‌ర్ల‌కు, క్యాడ‌ర్ కు ధైర్యం చెబుతూ నిల‌బ‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధంగా కావాల‌ని పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Jr NTR Enter into TDP Party : Jr.ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టే టైం వచ్చిందా..?

రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు అరెస్ట్, జైలుకు పంప‌డాన్ని నిర‌సిస్తూ టీడీపీ క్యాడ‌ర్ బంద్ కొన‌సాగిస్తోంది. కానీ, పోలీసుల భారీ మోహ‌రింపుతో కార్య‌క‌ర్త‌లు ముందుకు రాలేక‌పోతున్నారు. శాంతియుత ధ‌ర్నాలు, ర్యాలీలు కూడా లేకుండా ప్ర‌భుత్వం ఆర్డ‌ర్స్ ఇచ్చింది. దీంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా టీడీపీ లీడ‌ర్లు, క్యాడ‌ర్ ను పోలీస్ నిర్బంధించింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బాల‌య్య ముందుకొచ్చారు. ఇలాంటి దృశ్యాన్ని గ‌తంలో చంద్ర‌బాబుకు అల‌పిరి ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు చూశాం. అప్ప‌ట్లో సీఎంగా ఉన్న చంద్ర‌బాబును క్లైమోర్ మైన్స్ తో న‌క్స‌లైట్లు పేల్చారు. ప్ర‌మాదంలో చంద్ర‌బాబు  (TDP in camera) ప్రాణాపాయ‌స్థితో ఉన్నారు. ఆ స‌మ‌యంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న దేవేంద‌ర్ గౌడ్ సీఎం కుర్చీలో కూర్చుని రివ్యూ మీటింగ్ పెట్టారు. కొంద‌రు మంత్రులు కూడా ఆ రివ్యూకు హాజ‌ర‌య్యారు.

Also Read : TDP : చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీ పతనం ప్రారంభ‌మైంది : ఎమ్మెల్సీ పంచుమ‌ర్తి అనురాధ

అల‌పిరి సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు సీఎం హోదాలో చంద్ర‌బాబు ఉన్నారు. ఆయ‌న కుర్చీని అప్ప‌ట్లో దేవంద‌ర్ గౌడ్ అలంక‌రించ‌డం పెద్ద దుమారం రేపింది. కాబోయే సీఎం అంటూ దేవేందర్ గౌడ్ ను ఫోక‌స్ చేశారు. కానీ, చంద్ర‌బాబు వెంట‌నే కోలుకున్నారు. జ‌రిగిన ప‌రిణామాల‌ను తెలుసుకున్నారు. అప్ప‌టి నుంచి స‌మ‌కాలీకుల‌ను జాగ్ర‌త్త‌గా ప‌ర్య‌వేక్షిస్తుంటారు చంద్ర‌బాబు. ఇప్పుడు పార్టీ ప‌రంగా బాల‌య్య ఆయ‌న కుర్చీలో కూర్చున్నారు. సేమ్ అప్పుడు దేవేంద‌ర్ గౌడ్ మీద ఎలాంటి ప్ర‌చారం జరిగిందో, అలాగే ఇప్పుడు బాల‌య్య మీద కూడా మొద‌ల‌యింది. రాబోవు రోజుల్లో ఆయ‌న చేతికి పార్టీ వ‌స్తుంద‌ని అభిమానుల్లోని చ‌ర్చ‌.