వల్లభనేని వంశీపై కొనసాగుతున్న కేసులు కక్ష సాధింపుకు నిదర్శనమని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) విమర్శించారు. గన్నవరంలో జూన్ 4న జరగనున్న “వెన్నుపోటు దినం” నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంశీ(Vallabhaneni Vamshi)పై గత ఘటనలను తెరపైకి తీసుకొచ్చి, ఒకరి తర్వాత మరొకరు తప్పుడు కేసులు వేస్తూ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇది అధికార మదంతో కలిగిన దౌర్జన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
LPG Cylinder: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఏకంగా రూ. 24 తగ్గింపు!
115 రోజులుగా వంశీ అన్యాయంగా జైలులో ఉన్నారని, న్యాయాన్ని నమ్మి పోరాటం కొనసాగిస్తున్నామని పేర్ని నాని స్పష్టం చేశారు. దేవుడి మీద నమ్మకం, న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పారు. తప్పుడు కేసులతో వంశీ ఆరోగ్యాన్ని హానికరంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్ మానవత్వాన్ని మరిచి, రాజకీయంగా దిగజారి వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Temple Traditions: గుడిలో గడపకు ఎందుకు నమస్కారం చేస్తారో తెలుసా??
వంశీకి న్యాయం జరగాల్సిందేనని, ఇందుకోసం ఆయన భార్య పోరాటం చేస్తోందని నాని అన్నారు. “వంశీ భార్య సతీ సావిత్రిలా పోరాడుతుంది, న్యాయస్థానంపై ఆమెకు పూర్తి నమ్మకముంది” అంటూ ప్రశంసించారు. త్వరలో వంశీ విడుదలై గన్నవరంలో ప్రజల మధ్యకి వస్తారని, గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. ఎప్పటికీ గన్నవరంలో నాయకత్వం వంశీదే అని పేర్ని నాని తేల్చిచెప్పారు.