Site icon HashtagU Telugu

TDP : వారాహిలో అల్లర్లు సృష్టిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది.. వైసీపీకి టీడీపీ నేత య‌ర‌ప‌తినేని హెచ్చరిక‌

TDP

TDP

రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అర‌చ‌కాల‌పై టీడీపీ సీనియ‌ర్ నేత య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు ఆ పార్టీ నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర‌లో అల్ల‌ర్లు సృష్టిస్తే ప‌రిస్థితి వేరేలా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఏపీలో పరిణామాలు రావణ కాష్ఠంలా, తాలిబన్ల పాలన మాదిరిగా ఉన్నాయన్నారు. ఫ్యాక్షనిస్టు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందని.. తాను 16 నెలలు జైలుకు వెళ్లి వచ్చారు కాబట్టి మిగతా వారిని జైలుకు పంపాలని భావిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టి మళ్లీ ఎన్నికలలో గెలవాలని జ‌గ‌న్ చూస్తున్నార‌ని య‌ర‌ప‌తినేని ఆరోపించారు. తనను తాను జగన్ అద:పాతాళానికి తొక్కేసుకుంటున్నారని తెలిపారు. నైపుణ్యాభివృద్ది శిక్షణ కు 300 కోట్లు ఖర్చు చేస్తే 3 వేల కోట్ల అవినీతి ఎలా సాధ్యమో సిఐడి సంజయ్‌కే తెలియాల‌న్నారు. లేని రింగు రోడ్డులో అక్రమాలు జరిగాయని మరో కేసు పెట్టారని.. రాష్ట్రంలో వేల కోట్ల ఖనిజ సంపదను తవ్వి విదేశాలకు తరలిస్తున్నార‌ని య‌ర‌ప‌తినేని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

నౌకాశ్రయాలు జ‌గ‌న్‌కి నచ్చిన వారికి కట్టబెట్టారని.. మద్యం అమ్మకాల్లో ఏటా 12 వందల కోట్లు జగన్ కు వస్తున్నాయని ఆయ‌న ఆరోపించారు. ప్రభుత్వ ఆఫీస్ లకు వైసీపీ రంగులు వేసి రూ.3 వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించే డబ్బులకు.. చేసే అప్పులకు లెక్కలేదన్నారు.. సీఎఫ్ఎంఎస్ స్థానంలో వేరే సాఫ్ట్ వేర్ తెచ్చి ఖర్చులకు లెక్కలు తెలియకుండా చేస్తున్నారని య‌ర‌ప‌తినేని ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ టీం కు రూ300 కోట్లు ప్రజాధనం ఎలా ఇచ్చారని ఆయ‌న ప్ర‌శ్నించారు. జగన్ నేర స్వభావం తో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు పడ్డారని.. గతంలో శ్రీ లక్ష్మీ , ఎల్వీ సుబ్రహ్మణ్యం, గౌతం సవాంగ్ ఉదంతాలు అధికారులు గుర్తు తెచ్చుకోవాల‌న్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమాలు, మద్యం అమ్మకాలు, కోడి కత్తి కేసు, బాబాయ్ హత్య గురించి మాట్లాడే ధైర్యం సజ్జలకు ఉందా అని ప్ర‌శ్నించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏఏజి పదవికి రాజీనామా చేసి జగన్ ఇంట్లో పాలేరు పని చేసుకోవచ్చ‌ని య‌ర‌ప‌తినేని ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కుల గజ్జి తో కొట్టుమిట్టాడుతున్నార‌ని.. మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మ రెడ్డి పై ఎస్పీ తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా పోలీసులు మాచర్ల ఎమ్మెల్యే వద్ద బానిసత్వం చేస్తున్నారని మండిప‌డ్డారు.

Also Read:  AP : పవన్ కళ్యాణ్ కు పోలీసుల నోటీసులు