Site icon HashtagU Telugu

TDP : ఐఆర్ఆర్ కేసులో దర్యాప్తు అధికారి మార్పు వెనక పెద్ద రాజకీయ కుట్ర – టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌

TDP

TDP

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తప్పుడు మార్గాల్లో చంద్రబాబునో, మరొకరినో ఇరికించాలన్న దురుద్దేశంతోనే జగన్ సర్కార్ దర్యాప్తు అధికారిని మార్చినట్టు స్పష్టమవుతోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ చెప్పడం.. ఆయనలోని నటనా కౌశలానికి మచ్చుతునక అన్నారు. జగన్ కు తెలిసింది అరాచకం..దోపిడీ.. విధ్వంసమేన‌న్నారు. శాంతిభద్రతల వ్యవహారాలు.. వాటిని పర్యవేక్షించే విభాగాలు.. విచారణాసంస్థలు అన్నీ ముఖ్యమంత్రి అధీనంలోనే ఉంటాయని అందరికీ తెలుసని.. తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపే సంస్థలు, అధికారులు అందరూ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని ప్రజలకు బాగా తెలుసన్నారు. ముఖ్యమంత్రి .. ప్రభుత్వం మోపే అన్ని అభియోగాలు.. అభాండాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటి కప్పుడు ఆధారాలతో సహా సమాధానం చెబుతూనే ఉందని ధూళిపాళ్ల న‌రేంద్ర తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన వాస్తవాలను అన్ని రూపాల్లో ఇప్పటికే ప్రజల ముందు ఉంచామ‌ని తెలిపారు. చంద్ర‌బాబు జైల్లో ఉండటంపై మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్.. మరికొందరి వ్యాఖ్యలు వారి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమ‌న్నారు. నోరుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడే మంత్రులకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ధూళిపాళ్ల తెలిపారు. చంద్రబాబునాయుడి భద్రత, జైల్లోని పరిస్థితులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం మంత్రులకు హాస్యంగా కనిపిస్తోందని మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలు, రాష్ట్రం కోసం పనిచేయాల్సిన వ్యక్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన కేసుపై 20 నెలలుగా సీఐడీ విచారణ జరుపుతోందని.. ఇన్నినెలల్లో ఏమీ తేల్చకపోయినా..ఎలాంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబుని అరెస్ట్ చేశారన్నారు. ఈ పని ఎందుకు చేశారంటే జగన్ తన రాజకీయ కక్షతో.. పైశాచిక ఆనందం కోసం చేశాడని చిన్నపిల్లలు కూడా చెబుతారని దూళిపాళ్ల న‌రేంద్ర తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ రాజకీయకుట్రలు… వాటిలో పావులుగా మారిన అధికారులపై పూర్తిస్థాయి విచారణ జరిపించి, తప్పుచేసిన వారికి కఠినంగా శిక్షిస్తుందని హెచ్చ‌రించారు.

Also Read:  YSR Sampoorna Poshana Kit : జగన్ పౌష్టికాహారం ప్యాకెట్లో పాము కళేబరం..

Exit mobile version