AP Special Status: తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా

ఈ రోజు సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు ముందు ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది తెలుగు దేశం పార్టీ.

AP Special Status: ఈ రోజు సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు ముందు ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది తెలుగు దేశం పార్టీ. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. అదేవిధంగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం టీడీపీ ఎంపీ మాట్లాడుతూ.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేస్తూ, రాష్ట్రానికి హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా సాధికారత కోసం టీడీపీ ఎప్పుడూ పని చేస్తుందని, అదునులో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీడీపీ ఆమోదం తెలిపినట్లు రామ్మోహన్ అన్నారు. అలాగే శాసనసభ్యులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలనే డిమాండ్‌ను రామ్మోహన్ మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ నేత అభిషేక్ మన సంఘ్వి మాట్లాడుతూ.. అధికార బీజేపీ పార్టీ పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి సంబంధించిన ఎజెండా చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు. కాగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సెషన్‌లో వివిధ బిల్లులపై చర్చలు జరగనున్నాయి.

Also Read: AMB In Bangalore : బెంగళూరులోనూ మహేష్ బాబు AMB సినిమాస్.. లాంఛ్ ఎప్పుడంటే ?