Chandrababu: చంద్రబాబు `మహా` పోరు

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహాన్ని మార్చారు. మహా పాదయాత్ర రూపంలో జరుగుతున్న నష్టాన్ని గ్రహించారని తెలుస్తుంది.

  • Written By:
  • Updated On - October 28, 2022 / 12:38 PM IST

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహాన్ని మార్చారు. మహా పాదయాత్ర రూపంలో జరుగుతున్న నష్టాన్ని గ్రహించారని తెలుస్తుంది. అందుకే నష్టనివారణ చర్యలకు దిగారని పార్టీలో చర్చ జరుగుతుంది. మూడు రాజధానుల నినాదం వైసీపీకి ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో అనుకూలంగా మారుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. అదే విషయాన్ని ఆయా ప్రాంతాలకు చెందిన లీడర్లు బాబుకు వివరించారని తెలుస్తుంది. అందుకే ఆ రెండు ప్రాంతాల్లోని సమస్యలపై పోరుకు దిగాలని దిశానిర్దేశం చేసినట్టు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

ఈనెల 28వ తేదీ నుంచి ఆందోళనలకు టీడీపీ శ్రీకారం చుడుతోంది. ఈనెల 28వ తేదీన రిషికొండను తవ్వేయడంపైన , 29వ తేదీన దసపల్లా భూములపై, 30వ తేదీన అరకులోయలో గంజాయిసాగు, నవంబరు ఒకటోతేదీన అనకాపల్లిలో చక్కెర కర్మాగారాలను మూసేయడంపై, 3వ తేదీన హిర మండలం దగ్గర గొట్ట బ్యారేజ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపై పోరుబాటకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Also Read:  AP Politics : జగన్ ఫై `రెడ్డి` తిరుగుబాటు? ముహూర్తం కార్తీక సమారాధన

అమరావతి రైతులు అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో 60 రోజులపాటు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యాత్ర ప్రారంభించినప్పటి నుంచి మంత్రులు, ఉత్తరాంధ్రకు చెందిన నాయకుల వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాత్కాలికంగా పాదయాత్ర వాయిదా పడింది. కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు అడ్డుకోవడంతో యాత్రను వాయిదా వేశారు. ఈ యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించి మూడు రాజధానుల అనుకూల జేఏసీ, అమరావతి రైతులు మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అయితే యాత్రను రైతులు తాత్కాలికంగా విరమించినప్పటికీ తర్వాత సాగించినా వాతవరణం ఉద్రిక్తంగా మారే అవకాశంఉందని భావిస్తున్నారు. దీన్ని చక్కదిద్దే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని రైతులు అంటున్నారు.

గతంలోనూ చంద్రబాబు అమరావతికి మద్దతుగా జోలె పట్టి వైజాగ్ వరకు వెళ్లలేకపోయారు. కర్నూల్ ను టచ్ చేయలేకపోయారు. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ మహా పాదయాత్ర తీసుకొచ్చే లాభం కంటే పార్టీకి వచ్చే నష్టం జరుగుతుందని టీడీపీ తాజాగా గుర్తించినట్టు తెలుస్తుంది. అందుకే ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లోని స్థానిక సమస్యలపై పోరాటం చేయాలనీ టీడీపీ ప్రణాళిక రచించింది.

Also Read:  TDP vs YSRCP : వైసీపీ రాజకీయ లబ్ది కోసమే మూడు రాజధానులు – మాజీ మంత్రి య‌న‌మ‌ల‌