CBN Bail: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్, రెగ్యులర్ బెయిల్ మంజూరు!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - November 20, 2023 / 02:53 PM IST

CBN Bail: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో తీర్పు వచ్చింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ వేసుకున్న పిటీషన్ పై హైకోర్టు విచారణ కొద్ది రోజుల క్రితం పూర్తి చేసింది. దీంతో సోమవారం రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని తీర్పును ఇచ్చింది.

కాగా చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపైన వాదనలు పూర్తయిన తరువాత కోర్టు తీర్పునిస్తూ వెల్లడించింది. దీంతో, 52 రోజుల రిమాండ్ తరువాత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించింది. ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరు కాగా, తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది.

కాగా మధ్యంతర బెయిలు పొందిన చంద్రబాబు ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా హైదరాబాద్‌ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారన్నారనే కారణంతో ర్యాలీపై బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. స్కిల్ కేసులో అరెస్టు అయిన తర్వాత చంద్రబాబుపై దాదాపు ఆరేడు కేసులు నమోదయ్యాయి. ఇక హైకోర్టు తీర్పుతో ఇక చంద్రబాబు రాజమండ్రికి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ తీర్పు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపినట్టయింది. బాబుకు రెగ్యులర్ బెయిల్ రావడంతో త్వరలోనే ఆయన ప్రజల్లోకి వెళ్లే ఛాన్సు ఉంది.

Also Read: Team India: ఫైనల్ పోరులో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణాలివే!