Site icon HashtagU Telugu

AP Elections : టీడీపీ ప్రచార వాహనాన్ని తగలబెట్టిన దుండగులు

Tdp Campaign Vehicle Set In

Tdp Campaign Vehicle Set In

ఏపీలో ఎన్నికల సమయం (AP Elections) దగ్గర పడుతున్న కొద్దీ ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల వార్ నడుస్తుండగా..మరోపక్క ప్రచార వాహనాలను తగలబెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప్రచార వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు (TDP campaign vehicle was set on fire by unidentified assailants). పీలేరు మండంలోని వాల్మీకిపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ వాహనంలో ఉండగానే కొంతమంది వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే మంటలు గమనించిన డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉదయం ఎనిమిది గంటల సమయంలో టూ వీలర్‌పై వచ్చిన దుండగులు టీడీపీ ప్రచార వాహనంపై పెట్రోల్ వేసి నిప్పుపెట్టారు. వాహనంలో డ్రైవర్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో వాహనం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇది వైసీపీ నేతలే పనే అని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి గెలుపు ఖాయమని అర్ధం కావడంతో ఇలా దాడులకు పాల్పడుతున్నారని వారంతా వాపోతున్నారు. దీనిపై పోలీసులకు పిర్యాదు చేసారు. పీలేరు నుంచి వైసీపీ తరపున చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ నుంచి నల్లూరి కిషోర్‌కుమార్ రెడ్డి పోటీపడుతున్నారు.

Read Also : Ranbir Kapoor : సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్‌ని చూశారా.. లీకైన సెట్ ఫోటోలు..