స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసిన దగ్గరి నుండి టీడీపీ పార్టీ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ జగన్ (Jagan) ప్రభుత్వం ఫై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలకు పిలుపునిచ్చి సక్సెస్ చేసిన నారా లోకేష్ (Nara Lokesh)..తాజాగా మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దసరా రోజు..జగనాసుర దహనం (Jaganasura Dahanam) చేద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు. దసరా రోజున రావణదహనం చేయడం సాంప్రదాయం… కానీ ఈసారి జగనాసుర దహనం కూడా చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
”దేశం చేస్తోంది రావణాసుర దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం” పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రేపు (దసరా పండగరోజున అంటే అక్టోబర్ 23న ) రాత్రి 7 గంటల నుండి 7.05 నిమిషాల వరకు టిడిపి శ్రేణులు వీధుల్లోకి రావాలని లోకేష్ సూచించారు. ‘సైకో పోవాలి’ అన్ని నినాదాలు రాసిన పత్రాలను చేతబట్టి వైఎస్ జగన్, వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలని సూచించారు. అనంతరం ఆ పత్రాలను దహనం చేయాలన్నారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయాలని ..సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా పండగని సెలబ్రేట్ చేసుకుందాం’’ అని నారా లోకేష్ తెలిపారు.
Read Also : Kaleshwaram Project : కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమే – రేవంత్