Site icon HashtagU Telugu

TDP : బీటెక్ రవి అక్రమ అరెస్ట్ వైసీపీ కక్ష సాధింపు చర్య : టీడీపీ నేత బీద ర‌విచంద్ర

Beeda Ravichandra

Beeda Ravichandra

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ఓటమి భయం ప‌ట్టుకుంద‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీద ర‌విచంద్ర అన్నారు. సొంత నియోజకవర్గం పులివెందుల లో టీడీపీ బలపడుతుండటం, తనపై ప్రజా వ్యతిరేకత పెరగ‌డాన్ని సీఎం జ‌గ‌న్ ఓర్వ‌లేక‌పోతున్నార‌న్నారు. సొంత నియోజక వర్గం పులివెందుల లో బీటెక్ ర‌వి చురుగ్గా వ్యవహరిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆయ‌న ఆరోపించారు. అరెస్ట్ చేస్తున్నారో… కిడ్నాప్ చేస్తున్నారో అర్థం కాని రాష్ట్రంలో నెల‌కొంద‌న్నారు. వచ్చింది పోలీసులో , కిడ్నాపర్లో తేల్చుకోలేని దుస్థితి రాష్ట్రంలో నడుస్తోందని.. అరెస్ట్ చేశారా.. కిడ్నాప్ చేశారా తెలీక బీటెక్ రవి కుటుంబ సభ్యులు ఆందోళన కు గురై ఎస్పీ, డీఎస్పీ లకు ఫోన్ లు చేస్తే స్పందన కరువైందన్నారు. రవి పై 10 నెలల కిందట నమోదు అయిన బెయిలబుల్ కేసు నాన్ బెయిలబుల్ కేసు గా మారడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో పోలీసులు బహిరంగపర్చాలని బీద ర‌విచంద్ర డిమాండ్ చేశారు. టీడీపీ కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం, వాటిని నాన్ బెయిలబుల్ కేసులు గా మార్చి అరెస్ట్ చేయడం పోలీసులకు సర్వ సాధారణం అయిపోయిందన్నారు. బిటెక్ రవి అక్రమ అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని..ఆయన పై పోలీసులు నమోదు చేసిన నాన్ బెయిలబుల్ కేసులను ఎత్తివేయాలని బీద ర‌విచంద్ర డిమాండ్ చేశారు.

Also Read:  IT Raids: ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లో సోదాలు