Target BJP : పురంధ‌రేశ్వ‌రి టార్గెట్ గా చంద్ర‌బాబు భుజంపై తుపాకీ

Target BJP : ఏపీ బీజేపీ చీఫ్ పురంధ‌రేశ్వ‌రి విద్యావంతురాలు, సౌమ్మురాలు, పోరాడే తత్త్వం ఉన్న లీడ‌ర్. మంచి వ‌క్త .అంతేకాదు, జామాల‌జిస్ట్‌.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 02:28 PM IST

Target BJP : ఏపీ బీజేపీ చీఫ్ పురంధ‌రేశ్వ‌రి విద్యావంతురాలు, సౌమ్మురాలు, పోరాడే తత్త్వం ఉన్న లీడ‌ర్. మంచి వ‌క్త . అంతేకాదు, జామాల‌జిస్ట్‌, స్వర్గీయ ఎన్డీఆర్ రాజ‌కీయ‌ వార‌సురాలిగా పోక‌స్ అవుతున్నారు. హావ‌భావాలు కూడా స్వ‌ర్గీయ ఎన్డీఆర్ త‌ర‌హాలో ఉంటాయ‌ని ఆమె అభిమానుల భావ‌న‌. స్వ‌త‌హాగా ఆమెకు ఉన్న గ‌ట్స్ ను గ‌మ‌నించిన బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలిగా నియ‌మించింది. ఇప్పుడు ఆ ఫ‌లితాల‌ను ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు గ‌మన్నారు. ఆ విష‌యం తెలుసుకున్న అధికార వైసీపీ రివ‌ర్స్  రాజ‌కీయాన్ని మొద‌లు పెట్టింది.

వైసీపీ రివ‌ర్స్  రాజ‌కీయాన్ని మొద‌లు పెట్టింది (Target BJP)

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు, పురంధ‌రేశ్వ‌రి (Target BJP) ఒకే కుంటుంబానికి చెందిన రాజ‌కీయ‌వేత్త‌లు. కానీ, రాజ‌కీయంగా వాళ్లిద్ద‌రి మ‌ధ్యా సుదీర్ఘ గ్యాప్ ఉంది. అంతేకాదు, రాజ‌కీయ వైరం కూడా ఉంది. ఆమెను రాజ‌కీయంగా ఎద‌గ‌కుండా చంద్ర‌బాబు చేశార‌ని నంద‌మూరి కుటుంబాన్ని ద‌గ్గ‌ర‌గా చూసే వాళ్లు చెప్పే మాట‌. అందుకే, ఎన్టీఆర్ కుమార్తె అయిన‌ప్ప‌టికీ మ‌రోమార్గంలేక 2004 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని చెబుతుంటారు. ఆ ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్, ఇందిరాగాంధీ క‌టౌట్ల‌ను చెరోవైపు పెట్టుకుని ప్ర‌చారం చేసిన రాజ‌కీయ ధీర‌వ‌నిత‌ పురంధ‌రేశ్వ‌రి. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలోని కొన‌సాగుతూ తండ్రికి త‌గిన త‌న‌య‌గా పార్ల‌మెంట్ వేదిక‌గా మాజీ ప్ర‌ధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ తో ప్ర‌శంస‌లు అందుకున్నారు.

చంద్ర‌బాబు భుజం మీద తుపాకీపెట్టి పురంధ‌రేశ్వరిని

స‌మైక్య రాష్ట్రాన్ని విడ‌దీయ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ పురంధ‌రేశ్వ‌రి కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌రువాత కొంత కాలం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయితే, బీజేపీ ఆమెను ఆక‌ర్షించింది. ఆ పార్టీ త‌ర‌పున 2014 ఎన్నిక‌ల్లో ఒంగోలు లేదా విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని భావించారు. కానీ, బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబు వ్య‌తిరేకించార‌ని వినికిడి. అందుకే, ఆమె ఎన్నిక‌లకు దూరంగా ఉన్నారు.సుదీర్ఘ రాజ‌కీయ శ‌త్రుత్వం కార‌ణంగా టీడీపీ క‌లిసి రాక‌పోవ‌డంతో ఆమె ఓడిపోయార‌ని ద‌గ్గుబాటి వ‌ర్గీయులు భావిస్తుంటారు. ఆ త‌రువాత 2018 ఎన్నిక‌ల నాటికి రాజ‌కీయ ప‌రిణామాలు మారాయి. రాజంపేట నుంచి ఎంపీ అభ్య‌ర్థిగా 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున పోటీచేసిన పురంధ‌రేశ్వ‌రి నుంచి ఓడారు. జాతీయ మ‌హిళా మోర్చా అధ్యక్షురాలిగా ప‌నిచేసి బీజేపీ పెద్ద‌ల మ‌న్న‌న‌లు పొందారు. ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలిగా (Target BJP)బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

Also Read : Nellore TDP Incharge : నెల్లూరు రూర‌ల్ టీడీపీ ఇంఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి

ఇటీవ‌ల ప్రాంతాల వారీగా పురంధ‌రేశ్వ‌రి ప‌ర్య‌ట‌న‌లు పెట్టారు. ఆమె టీమ్ ను యాక్టివేట్ చేస్తున్నారు. అంతేకాదు, రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం గురించి తెలియ‌చేస్తున్నారు. ఏపీలోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద సున్నితంగా మంద‌లిస్తూ గ‌డ్డి పెడుతున్నారు. దీంతో వైసీపీ వ‌ర్గీయుల‌కు మండుతోంది. అలాగ‌ని, బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల్ని ఏమీ అన‌లేని ప‌రిస్థితి వైసీపీ లీడ‌ర్ల‌ది. అందుకే, పురంధ‌రేశ్వ‌రిని టార్గెట్ చేస్తూ (Target BJP) ట్వీట్ల‌ను మొద‌లు పెట్టారు. ఆమె కుటుంబానికి చెందిన చంద్ర‌బాబు భుజం మీద తుపాకీపెట్టి పురంధ‌రేశ్వరిని కాల్చాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, రాజ‌కీయాల్లో ఉన్న అంద‌రికీ చంద్ర‌బాబు, పురంధ‌రేశ్వ‌రి మ‌ధ్య రాజ‌కీయ వైరం ఉంద‌ని తెలుసు. అయితే, సామాన్య ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. అందుకే, వైసీపీ గేమాడుతోంది.

 Also Read : AP BJP : నేడు ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న పురంధేశ్వ‌రి

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అన్యాయం మీద లెక్క‌ల‌ను పురంధ‌రేశ్వ‌రి తీస్తున్నారు. ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెడుతున్నారు. కేంద్రం నుంచి వ‌చ్చిన నిధుల వివ‌రాల‌ను లాగుతున్నారు. ప్ర‌ధాని మోడీ ద్వారా వ‌స్తోన్న ప‌థ‌కాల‌ను ఎలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత ప్రాప‌కానికి వాడుకుంటున్నారు? అనే అంశాన్ని వెలుగెత్తుతున్నారు. అవినీతి, అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్నారు. ఆమె స్పీడ్ ను త‌ట్టుకోలేక చంద్ర‌బాబు తో ఉన్న బంధుత్వాన్ని రాజ‌కీయ ఆరోప‌ణ‌ల‌కు అనువుగా వైసీపీ మ‌లుచుకుంటోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు మార్గంలోనే పురంధ‌రేశ్వ‌రి న‌డుస్తున్నార‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో పాటు మంత్రులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇలాంటి మ‌చ్చ‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద వైసీపీ వేసింది. కానీ, పురంధ‌రేశ్వ‌రి (Target BJP) విష‌యంలో ఆ పార్టీ విజ‌యం సాధించ‌లేక‌పోవ‌చ్చు.