Site icon HashtagU Telugu

Talliki Vandanam : త్వరలోనే తల్లికి వందనంపై గైడ్ లైన్స్ – నారా లోకేష్

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే తల్లికి వందనం (Talliki Vandanam) పథకాన్ని అమలు చేయనున్నట్టు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఆయన శాసన మండలి (Legislative Council)లో వెల్లడించారు. తల్లికి వందనం పథకానికి 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన లోకేష్.. ఈ పథకం ద్వారా అనేక మంది తల్లులకు ఆర్థిక సహాయంతో పాటు మరిన్ని లబ్ధులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

Vidadala Rajini : విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు..?

ఈ పథకం ముఖ్యంగా విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించడానికి రూపొందించబడింది. విద్యను ప్రోత్సహించేందుకు తల్లులకు నేరుగా ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లుల భాగస్వామ్యంతో విద్యార్థుల అభ్యాస నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్ధుల చదువుకు ఆటంకం కలగకుండా ఉండటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో విద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ పథకం కీలకంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. త్వరలోనే అన్ని వివరాలతో అధికారిక ప్రకటన చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లులకు నేరుగా నిధులను బదిలీ చేసే విధానం, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వంటి అంశాలపై స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

MLA Guota MLC Candidates : కూటమి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరేనా..?