Aadudam Andhra : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి వైఎస్ జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మెరికల్లాంటి క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్ నిర్వహిస్తోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం అమలు కోసం ఏపీ సర్కారు 9 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. మరో రెండు సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని అధికారులు ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే ఏపీ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ లీగ్, ప్రైమ్ వాలీబాల్ లీగ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, పీవీ సింధు, ఆంధ్రా ఖో ఖో అసోసియేషన్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రా వాలీబాల్ అసోసియేషన్ ఉన్నాయి. ఈ సంస్థల సారథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మెరికల్లాంటి క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్ జరుగుతుంది. ఇక, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ క్రికెట్ టీమ్స్‌తోనూ చర్చలు జరుగుతున్నాయి. రాబోయే ఐపీఎల్, పీకేఎల్, పీవీఎల్ సీజన్స్ లలో ఏపీ క్రీడాకారులకు అవకాశాలు కల్పించే దిశగా ఒప్పందాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: BRS First Demand : రేవంత్ సర్కారుకు హరీశ్‌రావు తొలి డిమాండ్ ఇదే..
‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా ఏపీలోని జిల్లాల్లో ఆటల పోటీలను డిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించనున్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, యోగ, టెన్నికాయిట్, మారధాన్ వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. పురుషులు, మహిళల కోసం ఐదు విభాగాల్లో వేర్వేరుగా క్రీడా పోటీలు నిర్వహిస్తారు. 15 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు మాత్రమే ఈక్రీడల్లో(Aadudam Andhra) పాల్గొనేందుకు అర్హులు.