Site icon HashtagU Telugu

JC Prabhakar Reddy: కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా… తేల్చుకుందాం..

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు మరోసారి కుదిపేస్తున్నాయి. టిడిపి నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి – వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం కాస్తా సవాళ్ల దాకా చేరింది. ఇద్దరి మధ్యా సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు తాడిపత్రి వాతావరణాన్ని ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని నేరుగా సవాల్ విసిరారు. “దమ్ముంటే తాడిపత్రికి రా… తేల్చుకుందాం” అంటూ ఆయన విసిరిన సవాల్ స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కేతిరెడ్డి తాడిపత్రిలో ప్రవేశంపై స్పందించిన జేసీ, “నాకు వ్యక్తిగత కక్ష లేదు. కానీ, కేతిరెడ్డి గతంలో చేసిన దౌర్జన్యాలపై ప్రజలకు సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

Sorry : ఒక్క “సారీ” మీ రిలేషన్ ను​ స్ట్రాంగ్ చేస్తుందని మీకు తెలుసా..?

హైకోర్టు అనుమతి ఉంటే ఆయన తాడిపత్రి రావచ్చని జేసీ అంగీకరించినా… గతంలో టిడిపి నేతలకూ కోర్టు ఆదేశాలు ఉన్నా పెద్దారెడ్డి ప్రవేశం నిరాకరించారని గుర్తుచేశారు. “ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా, తాడిపత్రి ప్రజల భయాందోళనల కారణంగా మేము ఆయనకు అనుమతించం” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, “ముందుగా తాడిపత్రిలో అక్రమంగా కట్టిన ఇల్లు గురించి సమాధానం చెప్పుకోవాలి. అది పరిష్కరించకుండా ఇక్కడి రాజకీయాల్లోకి రావొద్దు” అని జేసీ తీవ్రంగా విమర్శించారు.

తనపై వచ్చిన విమర్శలకు సమాధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, “మా దగ్గర అప్పట్లో గన్‌మెన్లు లేరు, ఈరోజు కూడా లేరు” అన్నారు. అయితే, పెద్దారెడ్డిని ఎద్దేవా చేస్తూ, “ఆయన దగ్గర ఏకే 47లతో గన్‌మెన్లు ఉంటారు” అంటూ వ్యాఖ్యానించారు. అలాగే పోలీసులపై అనవసర ఆరోపణలు చేయొద్దని సూచించారు. ఇక హైకోర్టు ఆదేశాలు సాధించిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీని కారణంగా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే జేసీ వర్సెస్ కేతిరెడ్డి మధ్య పలు సార్లు వివాదాలు రగిలాయి. ఈసారి కూడా సవాళ్లు, ప్రతిసవాళ్లతో తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉత్కంఠ నెలకొంది. రెండు వర్గాల మధ్య పెరుగుతున్న పోటీతో ప్రజల్లో కూడా ఆసక్తి, ఆందోళనలు పెరుగుతున్నాయి.

CBN Fire : ముగ్గురు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

Exit mobile version