Site icon HashtagU Telugu

Tadepalli: తాడేపల్లి కోటకు సుప్రీమ్ టెన్షన్, సునీత పిటిషన్ పై సోమవారం విచారణ

Viveka murder

Tadepalli Kotaku Supreme Tension, Hearing On Sunitha's Petition On Monday

సుప్రీం కోర్ట్ భయం వైఎస్ కుటుంబాన్ని వెంటాడుతోంది. తెల్లవారితే కోర్టు ఏమి చెబుతుందోనన్న ఆందోళన తాడేపల్లి (Tadepalli) కోటలో కనిపిస్తుంది. మాజీ మంత్రి వివేకా కుమార్తె వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో సోమవారం విచారణకు రాబోతుంది. తెలంగాణ హై కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ ను సవాల్ చేస్తూ సునీత సుప్రీం కు వెళ్లిన విషయం విదితమే. దానిపై గతవారం విచారణ జరిగిన సందర్భంగా వాదనలకు అవినాష్ లాయర్లు టైం అడిగారు. దీంతో సోమవారంకు కేసు వాయిదా పడింది.

ప్రతి వాదులకు ఆ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఆ పిటిషన్ మీద అవినాష్ రెడ్డి తరపున న్యాయవాదులు సోమవారం వాదనలు వినిపిస్తారు. అప్పుడు సుప్రీం ఇచ్చే తీర్పు అవినాష్ రెడ్డి అరెస్ట్ ను తేలనుంది. వాస్తవంగా ముందస్తు బెయిలు పైహై కోర్ట్ గత వారం తీర్పు ఇస్తూ 25 వ తేదీ వరకు అరెస్ట్ వద్దని చెప్పింది. దానిపై సుప్రీం స్టే ఇస్తూ 25 వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐ కి సూచించింది.

గత నాలుగు రోజులుగా ప్రతి రోజు అవినాష్ ను సీబీఐ విచారిస్తుంది. ఆ క్రమంలో ఆదివారం సీబీఐ సిట్ లోని ఒక టీమ్ కడపకు వెళ్ళింది. హత్య జరిగిన ప్లేస్ ను పరిశీలించింది. అక్కడ నుంచి అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి తనిఖీలు చేసింది. ఆయన పిఏ, కంప్యూటర్ ఆపరేటర్ లను విచారించింది. అవినాష్ పాత్రపై నిర్దారణకు రావడానికి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసింది. హత్య జరిగిన రోజు సమీపంలోని గ్రామానికి ప్రచారం కోసం వెళ్ళాను అని చెప్పిన అవినాష్ మాటలను నిర్దారించు కోవడానికి ఆ గ్రామానికి సీబీఐ టీం వెళ్ళింది.

వివేకా , అవినాష్ రెడ్డి ఇంటికి ఉన్న దూరం నుంచి ఆ రోజు జరిగిన సంఘటనపై మినిట్ తో మినిట్ సీన్ కన్స్ట్రక్షన్ చేశారు సీబీఐ అధికారులు. ఆదివారం ఉదయం నుంచి పులివెందుల లొనే సీబీఐ అధికారులు ఉన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ ఇయంతుల్లాను ఒంటరిగా బయటకు తీసుకెళ్లిన సీబీఐ అధికారులు సుదీర్ఘంగా అతన్ని విచారణ చేశారు. హత్య జరిగిన రోజు ఎవరు ఫోటోలు తీశారు? ఎవరెవరికి పంపారు? అప్పుడు పంపారు? ఇలాంటి అంశాలను అతని నుంచి రాబట్టారు.

వరుసగా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను విచారణ చేసిన సీబీఐ సోమవారం ప్రోగ్రెస్ రిపోర్ట్ ను సుప్రీం కోర్ట్ కు అందించనుంది. ఒక టీం ఢిల్లీ వెళ్లగా మరో టీం అవినాష్ రెడ్డి వ్యవహారాన్ని తేల్చడానికి కసరత్తు చేస్తోంది. విచారణ కోసం సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న కొద్దే సీబీఐ పెంచిన వేగం తాడేపల్లి (Tadepalli) కోటను కదిలిస్తుంది. సోమవారం ఇచ్చే సుప్రీమ్ కోర్ట్ ఇచ్చే డైరెక్షన్ సర్వత్రా టెన్షన్ పుట్టిస్తుంది.

Also Read:  CBI: ఆదివారం 6 గంటలు విచారణ, కీలక సమాచారం రాబట్టిన సీబీఐ

Exit mobile version