ఏపీ పోలింగ్ లో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పోలింగ్ రోజు మాత్రమే కాదు ఆ తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీటి ఫై వివరణ ఇవ్వాలని ఈసీ ఏపీ సీఎస్, డీజీపీ లకు ఆదేశాలు జారీ చేయడం తో గురువారం ఢిల్లీ లోని ఈసీ ఎదుట హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ 12 మంది అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. హింసాత్మక ఘటనలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది. అలాగే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మళ్లీ ఉద్రిక్తతలు చోటు అవకాశం ఉందని ఈసీ అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలు విడుదల అయిన 15 రోజుల వరకూ రాష్ట్రంలో కేంద్రబలగాలను కొనసాగించాలని ఆదేశించింది. అవసరమైతే మరిన్ని బలగాలనూ వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్రహోంశాఖకు ఆదేశించింది.
Read Also : AP : జగన్ రెడ్డి ఎంత పెద్ద కుట్రకు తెర లేపాడో ..!! – టీడీపీ బట్టబయలు