Site icon HashtagU Telugu

Survey : TDPదే అధికారం! BJPతో చంద్ర‌బాబుకు చేటు!ఆత్మ‌సాక్షి లేటెస్ట్‌ స‌ర్వే

Survey

Survey Pic

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి, వివేకానంద‌రెడ్డి మ‌ర్డ‌ర్ కేసుల్లోని ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుకు(Survey) వ‌చ్చేలా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా కూడా ఎన్నిక‌ల చివ‌రి ఘ‌ట్టంలో ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు(Alliance) కుదిరింది. అయితే, బీజేపీతో పొత్తు తెలుగుదేశం పార్టీకి న‌ష్టం క‌లిగిస్తుంద‌ని తాజాగా ఆత్మ‌సాక్షి చేసిన స‌ర్వే ఆధారంగా స్ప‌ష్టమ‌వుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ చేసిన స‌ర్వే ప్ర‌కారం టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిగా వెళితే మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిగా వెళితే మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం(Survey)

మొత్తం నాలుగు ఆప్ష‌న్ల‌ను ఎంచుకుని ఆత్మ‌సాక్షి సంస్థ ఈ స‌ర్వే(Survey)ను చేసింది. తొలి ఆప్ష‌న్ కింద ఏ పార్టీకి ఆ పార్టీ (ఒంట‌రిగా) పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే, 27 నుంచి 30 స్థానాల్లో నువ్వా-నేనా అనేలా పోటీ జ‌ర‌గ‌నుంది. ఆ స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధించగ‌లిగితే ఒంట‌రిగా అధికారంలోకి వ‌స్తుంద‌ని అంచ‌నా వేసింది. కేవ‌లం 6 నుంచి 7 స్థానాల‌కు జ‌న‌సేన ప‌రిమితం కానుంద‌ని తేల్చింది. తెలుగుదేశం పార్టీ 78 నుంచి 81 స్థానాల‌ను ఈజీగా గెలుచుకుంటుంద‌ని స‌ర్వే సారాంశం. అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 63 నుంచి 72 స్థానాల‌కు పరిమితం కానుంది. కీన్ కంటెస్ట్ స్థానాలు 27 నుంచి 30 స్థానాలు అధికారాన్ని తేల్చ‌నున్నాయని అంచ‌నా. వ్యూహాత్మ‌కంగా తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టి నుంచి ఆ స్థానాల‌పై దృష్టి పెడితే తేలిగ్గా సొంతం చేసుకోవ‌చ్చ‌ని స‌ర్వేలోని ప్రధాన అంశం.

Also Read : Survey: డేంజర్ జోన్లో కేసీఆర్, జగన్ – సీ ఓటర్ సంచలన సర్వే

రెండో ఆప్ష‌న్ కింద టీడీపీ, జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళితే(Alliance) తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుంద‌ని తేల్చింది. ఈ రెండు పార్టీల కూట‌మి 110 నుంచి 115 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని అంచ‌నా వేసింది. కేవ‌లం 65 నుంచి 68 స్థానాల‌కు వైసీపీ ప‌రిమితం కానుంది. కీన్ కంటెస్ట్ 10 నుంచి 12 స్థానాలు ఉంటాయ‌ని స‌ర్వే(Survey) ఫ‌లితం చెబుతోంది. ఇక మూడో ఆప్ష‌న్ కింద టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి ఎన్నిక‌ల‌కు వెళితే, వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చింది. క‌నీసం 90 నుంచి 98 స్థానాలను వైసీపీ గెలుచుకోనుంది. అదే మూడు పార్టీల కూట‌మి 68 నుంచి 73 స్థానాల‌కు ప‌రిమితం కానుంది. కీన్ కంటెస్ట్ కేవ‌లం 4 నుంచి 8 స్థానాల్లో మాత్ర‌మే ఉంది.

 

టీడీపీ, జ‌న‌సేన‌, ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు కూట‌మిగా(Alliance)

నాలుగో ఆప్ష‌న్ కింద టీడీపీ, జ‌న‌సేన‌, ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు కూట‌మిగా(Alliance) ఏర్ప‌డితే, అత్య‌ధికంగా ఆ కూట‌మి స్థానాల‌ను కైవ‌సం చేసుకోనుంది. క‌నీసం 116 నుంచి 120 స్థానాల‌ను కైవ‌సం చేసుకుని అధికారంలోకి రానుంది. అత్య‌ధికంగా ఈ కూట‌మిని కోరుకుంటున్నారు. ఈ కూట‌మి పొత్తును 57.5శాతం మంది కోరుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేవ‌లం 60 నుంచి 62 స్థానాల‌కు వైసీపీ ప‌రిమితం కానుంది. కీన్ కంటెస్ట్ కేవ‌లం 3 నుంచి 4 స్థానాల్లో మాత్ర‌మే జ‌ర‌గ‌నుంది. ఈ స‌ర్వే(Survey)ప్ర‌కారం నాలుగో ఆప్ష‌న్ బెస్ట్ గా క‌నిపిస్తోంది. ఇక రెండో బెస్ట్ ఆప్ష‌న్ గా టీడీపీ, జ‌న‌సేన కూట‌మిగా ఉంది. బీజేపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం మాత్రం ప్ర‌మాదంగా తెలుగుదేశం పార్టీకి డేంజ‌ర్ గా ఉంద‌ని ఆత్మ‌సాక్షి స‌ర్వే తేల్చింది.

Also Read : Atmasakshi Survey: `ఆత్మ‌సాక్షి` లేటెస్ట్ సర్వే.. ‘బాబు’ వైపు ఏపీ మూడ్!