YCP Leaders Response: తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ జరిగితే అది తీవ్రమైన అంశమని.. అందుకే దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపితే మంచిదన్నారు. స్వతంత్ర సిట్‌ను ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు, Fssai నుంచి ఒకరు ప్రాతినిథ్యం వహించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ లడ్డూ విషయం రాజకీయం కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తప్పవని కోర్టు తెలిపింది.
అయితే కోర్టు తీర్పుతో వైసీపీ నాయకులు (YCP Leaders Response) తమదే విజయమని చెబుతున్నారు. అంతేకాకుండా కోర్టు ద్వారానే నిజం వెలుగులోకి వస్తుందని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం స్పందించారు.
Also Read: CM Chandrababu : లడ్డూ వివాదం..సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం చంద్రబాబు
వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్ ఇదే
టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారని.. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ వివాదంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగిందన్నారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందన
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. సీబీఐ సిట్ బృందం విచారణను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. తిరుమల లడ్డూపై కేవలం దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని మండిపడ్డారు.