Srisailam : 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్ట పరిధిలోని ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల నిర్వహణకు సంబంధించిన పిలిచే టెండర్లలో హిందూేతరులు పాల్గొనకూడదని జారీ చేసిన జీవో నె.426ని సమర్థిస్తూ 2019 సెప్టెంబర్ 27న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం, ఆ జీవో ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ లోని దేవాదాయశాఖకు సంబంధించిన ఆలయాల ప్రాంగణాల్లోని వ్యాపారాల నిర్వహణ కోసం పిలిచే టెండర్లలో హిందూేతరులు పాల్గొనకూడదని నిర్ణయించబడింది.
Global Whisky Competitions: ప్రపంచ విస్కీ అవార్డులలో భారతీయ విస్కీదే పైచేయి!
ఈ తీర్పు పై సుప్రీంకోర్టు 2019లో స్టే ఇవ్వడంతో, హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుకు అడ్డంకి ఏర్పడింది. అయితే, ఈ స్టే ఉండగా, శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆ జీవో ఆధారంగా మళ్లీ టెండర్లు పిలిచారు. దీని పట్ల పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి, ఆ టెండర్ల ప్రక్రియపై పోరాడారు.
ఈ వ్యవహారం మీద 2025, ఫిబ్రవరి 19న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓక, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. దీనిలో, ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు, దేవాదాయశాఖ అధికారులు తమ పొరపాటును అంగీకరించి, టెండర్లను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.
పిటిషనర్ల తరపు న్యాయవాదులు వారి వాదనలో, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఇలాంటి టెండర్ల ప్రక్రియలను జారీ చేస్తోందని, ఇది మూడోసారి జరుగుతుండటంతో, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా నిబంధనలు స్పష్టంగా అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరి 27న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగుతుందని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ తీర్పు అమలు చేయవద్దని స్పష్టం చేసింది. జీవో 426 అమలును నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం కట్టుదిట్టంగా ప్రకటించింది.