Amaravathi: అమ‌రావ‌తి పై `సుప్రీం` చీఫ్ ల‌లిత్ కీల‌క నిర్ణ‌యం

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో సుప్రీం కోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పి

  • Written By:
  • Updated On - November 1, 2022 / 01:52 PM IST

అమరావతి రాజ‌ధాని విష‌యంలో సుప్రీం కోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పిటిష‌న్ల‌ను మ‌రో బెంచ్ కు బ‌దిలీ చేస్తూ చీఫ్ జ‌స్టిస్ లలిత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పిటిష‌న్ల‌పై విచార‌ణ చేయ‌డానికి ఆయ‌న నిరాక‌రించ‌డం కీల‌క ప‌రిణామం. మూడు రాజ‌ధానులు వ‌ర్సెస్ అమ‌రావ‌తి అంశం సుప్రీం కోర్టుకు సైతం ఛాలెంజ్ గా మారింది.

అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేలా జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యం విదిత‌మే. విచార‌ణ జ‌రుగుతుండ‌గా మూడు రాజ‌ధానులు, అధికార వికేంద్రీక‌ర‌ణ బిల్లును ఏపీ ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. దీంతో అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధానిగా ఉండాల‌ని కొన్ని కండీష‌న్లు పెడుతూ రైతుల‌కు న్యాయం చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ కు హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది. కానీ, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సత్వర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీంతో మంగ‌ళ‌వారం విచారణ వ‌చ్చిన అమరావతి, మూడు రాజధానుల పిటిష‌న్ల‌ను మ‌రో బెంచ్ కు బ‌దిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read:  AP Formation Day: నిరాడంబ‌రంగా ఏపీ అవ‌త‌ర‌ణ వేడుక‌లు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అడ్డంకిగా మారింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్లపై విచారణకు ఛీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నిరాకరించారు. మరో బెంచ్ కు ఈ పిటిషన్లను బదిలీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల అంశంపై క్షేత్ర‌స్థాయి పోరాటానికి వైసీపీ దిగింది. విశాఖ‌, తిరుప‌తి కేంద్రంగా మూడు రాజ‌ధానుల కోసం స‌భ‌ల‌ను పెట్టింది. అమ‌రావ‌తి రాజ‌ధాని ఒక్క‌టే కాద‌నే సంకేతాన్ని ఇచ్చింది. సంపూర్ణ రాజ‌ధాని విశాఖ‌లోనే ఉండాల‌ని తాజాగా మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు డిమాండ్ చేస్తున్నారు. ఇలా మూడు రాజ‌ధానుల అంశం ఏపీలోని మూడు ప్రాంతాల మ‌ధ్య వైవిధ్యంగా మారింది. అత్యున్నత న్యాయ‌స్థానం మంగ‌ళ‌వారం నాడు ఏదో ఒక సంచ‌ల‌న తీర్పును ఇస్తుంద‌ని భావించారు. కానీ,చీఫ్ జ‌స్టిస్ విచార‌ణ‌కు నిరాక‌రించ‌డంతో ఇప్ప‌ట్లో ఆ ప‌టిషిన్ల‌పై విచార‌ణ ఉండే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది.

Also Watch:

Also Read:   Bharat Jodo Yatra: `భాగ్య‌న‌గ‌రం`లో భార‌త్ జోడో