YSRCP : ఈరోజు పోస్టల్‌ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో విచారణ

  • Written By:
  • Publish Date - June 3, 2024 / 10:58 AM IST

Postal ballot votes: వైసీపీ(YSRCP) పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కౌంటింగ్‌ విషయంలో ఎన్నికల సంఘం(Election Commission) తీరుపై న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) ముందుకు ఈ అంశం విచారణకు రానుంది. రేపు ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టాలన్న వైసీపీ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మరికాసేపట్లో జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ పిటిషన్‌ విచారణ చేపట్టనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపి(AP)లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ మీనా(Mukesh Kumar Meena) ఇచ్చినా ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది తెలిసింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటే చాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్ ఆమోదించాలన్న ఏపీ సీఈవో మెమోను.. తదనంతరం ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని వైసీపీ కోరుతోంది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ పై ఏపి హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్‌ వేసింది వైసీపీ. ఇవాళ్టి కేసు జాబితాలో ఐటెం నెంబర్‌44గా వైసీపీ పిటిషన్‌ రికార్డయ్యింది.

Read Also: AP Results : బాబాయ్ ఏపీలో ఎవరు గెలుస్తారంటావ్..?

రేపే కౌంటింగ్‌ కావడంతో.. నేడు త్వరగా విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాది, సుప్రీం ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. అలాగే.. దేశం అంతటా ఎన్నికల సంఘం ప్రస్తుతం అమలు చేస్తున్న ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని వాదనలు వినిపించే అవకాశాలున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌ వరకే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ పిటిషన్‌ను అడ్డుతగలాలని టీడీపీ కుట్రలు చేస్తోంది.

సుప్రీం కోర్టులో వైసీపీ పిటిషన్‌ విచారణకు అడ్డు పడేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టులో కేవివేట్ దాఖలు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు విషయంలో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని కేవియట్‌లో వెలగపూడి పేర్కొన్నారు. అంతకు ముందు.. ఏపీ హైకోర్టులోనూ ఆయన తమనూ ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలంటూ పిటిషన్‌ వేయడం గమనార్హం.

Read Also: Kerala Rains : కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు

ఇక, వైసీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పోస్టల్‌బ్యాలెట్‌ ఈసీ మెమోపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అదే సమయంలో ఏపీ సీఈవో నిర్ణయాన్ని సమర్థించిన కేంద్ర ఎన్నికల సంఘం, మెమోలో కొంత పార్ట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతూ డబుల్‌ గేమ్‌ ఆడింది. అయినప్పటికీ వైసీపీ బలమైన వాదనలే వినిపించింది. రాత్రికి రాత్రే మెమో తేవాల్సిన అవసరం ఏముందని, దేశంలో ఎక్కడా లేని రూల్‌ను ఏపీలో తీసుకురావడంలో ఆంతర్యమేంటని వాదించింది.

కానీ, పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసి, ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు వైసీపీకి అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. దీంతో వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Read Also: Times Now Exit Poll : వైసీపీకి 117-125 సీట్లు