AP PCC: ఏపీ పీసీసీగా ‘ప‌ద్మ‌శ్రీ’..?

రాజ‌కీయ పార్టీలు విధాన‌ప‌ర‌మైన చేస్తే, మ‌ళ్లీ కోలుకోవ‌డం చాలా క‌ష్టం. ఆ విష‌యం కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. అందుకే, దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల‌కు తోక‌గా మారింది. ప్ర‌త్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కూడా కోల్పోతోంది. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడ‌దీసిన ఫ‌లితాన్ని ఆ పార్టీ అనుభవిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Sunkara Padmasri

Sunkara Padmasri

రాజ‌కీయ పార్టీలు విధాన‌ప‌ర‌మైన చేస్తే, మ‌ళ్లీ కోలుకోవ‌డం చాలా క‌ష్టం. ఆ విష‌యం కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. అందుకే, దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల‌కు తోక‌గా మారింది. ప్ర‌త్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కూడా కోల్పోతోంది. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడ‌దీసిన ఫ‌లితాన్ని ఆ పార్టీ అనుభవిస్తోంది. ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. తెలంగాణ రాష్ట్రంలో వెంటిలేట‌ర్ పై ఉంది. దానికి రాజ‌కీయ చికిత్స చేయ‌డానికి ఏఐసీసీ ప‌లు ప్ర‌య‌త్నాలను చేస్తోంది. ఆ క్ర‌మంలో మ‌హిళా నాయ‌క‌త్వాన్ని తీసుకురావాల‌ని భావిస్తోంద‌ట‌. ఆ కోటాలో సుంక‌ర ప‌ద్మ‌శ్రీకి పీసీసీ ప‌గ్గాలు ద‌క్కే ఛాన్స్ క‌నిపిస్తోంది.

Also Read : ఐ డోన్ట్ నో ‘హీరో నాని’.. నో ఓన్లీ ‘కొడాలి’ నాని!

2014, 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అడ్ర‌స్ లేకుండా పోయింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ గ‌ల్లంతు అయింది. ఏపీ ప్ర‌జ‌లు ఆ పార్టీని దాదాపుగా మ‌రిచిపోయారు. కానీ, నాయ‌క‌త్వం మాత్రం మ‌ళ్లీ ఏదో విధంగా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీ పీసీసీ అధ్య‌క్షుడుగా ర‌ఘువీరారెడ్డిని నియ‌మించింది. చ‌చ్చిపోయిన పార్టీకి ఊపిరి పోయ‌డానికి ఆయ‌న శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేశాడు. ఏడాదిన్న‌ర క్రితం వివిధ‌ కార‌ణాల‌తో ఆయ‌న త‌ప్పుకున్నాడు. మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ కు ఏపీ పీసీసీ బాధ్య‌త‌లను ఏఐసీసీ అప్ప‌గించింది.ఇప్పుడు మ‌ళ్లీ తాజాగా పీసీసీ చీఫ్ ను మార్చ‌డానికి ఏఐసీసీ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ క్ర‌మంలో ఏపీ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉమెన్ చాందీ ప్ర‌త్యేక స‌మావేశాన్ని విజ‌య‌వాడ‌లో వారం క్రితం నిర్వ‌హించాడు. క‌నీసం 2024 ఎన్నిక‌ల నాటికి ఉనికిని కాపాడుకోవ‌డానికి బ‌ల‌మైన నాయ‌కుడికి పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని ఆ స‌మావేశంలో ప్ర‌స్తావించాడ‌ట‌. ఇప్పుడున్న శైల‌జానాథ్ కంటే మెరుగ్గా పార్టీని న‌డిపే లీడ‌ర్ల జాబితాలో జేడీ శీలం, చింతామోహ‌న్‌, కిర‌ణ్‌కుమార్ రెడ్డి, సుంక‌ర ప‌ద్మ‌శ్రీ, ర‌ఘువీరారెడ్డి, ప‌ల్లంరాజు త‌దితరుల పేర్ల‌ను ప‌రిశీలించిన‌ట్టు తెలుస్తోంది.
తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి లాంటి లీడ‌ర్ ఏపీకి అవ‌స‌ర‌మ‌ని చాలా కాలంగా ఏఐసీసీ అన్వేషిస్తోంది. అనేక పేర్ల‌ను ప‌రిశీలించిన‌ప్ప‌టికీ తుది నిర్ణ‌యానికి రాలేక పోతోంది. సుంక‌ర పద్మ‌శ్రీ పేరును ఏఐసీసీ ప‌రిశీలిస్తుంద‌ట‌. ఆమె తొలి నుంచి అమ‌రావ‌తి రైతుల కోసం పోరాడుతోంది. ఉద్య‌మించే మ‌హిళగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. సామాజిక ఈక్వేష‌న్ ప‌రంగా కూడా ఆమెకు ప్రాధాన్యం ఇవ్వొచ్చ‌ని ఢిల్లీ వ‌ర్గాల వినికిడి.

Also Read : ఆ స‌ర్వేతో 100 మంది ఔట్‌?లోకేష్ మార్క్ షురూ!

మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌స్తుం కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ చురుగ్గా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డంలేదు. ఆయ‌న‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే, రాబోవు రోజుల్లో పార్టీని దూకుడుగా తీసుకెళ‌తాడ‌ని కొంద‌రు ఏఐసీసీకి తెల‌య‌చేశార‌ట‌. ఆర్థిక‌, సామాజిక కోణాల‌ను ప‌రిశీలిస్తే కిర‌ణ్ కుమార్ రెడ్డి పీసీసీకి స‌రైన లీడ‌ర్ గా ప‌లువురు భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ప‌ద్మ‌శ్రీ, కిర‌ణ్ కుమార్ రెడ్డిల‌లో ఏవ‌రో ఒక‌ర్ని పీసీసీగా చేస్తే మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీ కొంత కోలుకుంటోందని ఉమెన్ చాంది అంచ‌నా వేస్తున్నాడ‌ట‌. మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌నుకుంటే ప‌ద్మ‌శ్రీ పీసీసీ కాబోతుంద‌న్న‌మాట‌. సో..ఏదో ఒక కొత్త ప్ర‌యోగం కాంగ్రెస్‌ను బ‌తికిస్తుంద‌ని ఏఐసీసీ ఆశ‌.

  Last Updated: 24 Dec 2021, 01:52 PM IST