Site icon HashtagU Telugu

Talliki Vandanam : విద్యార్థులు ఈ పత్రాలు అందజేస్తేనే తల్లికి వందనం డబ్బులు

Talliki Vandanam Guidelines

Talliki Vandanam Guidelines

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రముఖ పథకం “తల్లికి వందనం” అమలు తేదీ దగ్గరపడుతోంది. ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం పూర్తి కావడాన్ని పురస్కరించుకుని జూన్ 12న ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సాయం జమ చేయనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా, అందరికీ ఒకేసారి డబ్బు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

Bengaluru Stampede: ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. వారిని అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు!

ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తించదని, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకూ ఈ ఆర్థిక సహాయం అందుతుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మొదట జూలై 2024లో విడుదలైన జీవో నం.29 ప్రకారం ఇది బీపీఎల్ కుటుంబాలకు పరిమితం చేసినా, తాజా ప్రకటనలతో అన్ని వర్గాల విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.9,407 కోట్లు బడ్జెట్ కేటాయించింది. అయితే, ఈ సాయం పొందాలంటే విద్యార్థులు చదువుతున్నట్లు స్కూల్ ధృవీకరణ, ఆధార్, బ్యాంకు ఖాతా వంటి పత్రాలు సమర్పించడం అవసరం.

TDP Government: ఏడాది కాలంలో కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలివే!

గత ప్రభుత్వ హయాంలో అమలైన “అమ్మ ఒడి” పథకాన్ని మాదిరిగా ఈ పథకంలో కూడా విద్యార్థి హాజరు 75 శాతం ఉండాలన్న నిబంధనను కొనసాగించే అవకాశం ఉంది. అధికారిక గైడ్‌లైన్స్ విడుదలైతే మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో తల్లులు ఆధికారిక వెబ్‌సైట్లు లేదా విద్యాశాఖ అధికారుల నుంచే సమాచారాన్ని పొందాలని సూచిస్తున్నారు. స్కూళ్లు తెరుచుకునే జూన్ 12నాటికి డబ్బు ఖాతాల్లో జమ చేయడం ద్వారా ఈ పథకాన్ని ప్రభావవంతంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.