AP Minister vs Student Union: మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్రెస్ మీట్ లో గంద‌ర‌గోళం

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్రెస్ మీట్‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది.విజ‌య‌వాడ ఆర్ అండ్ బీ బిల్డింగ్‌లో ఈ రోజు మంత్రి సురేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

  • Written By:
  • Publish Date - November 9, 2021 / 10:10 PM IST

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్రెస్ మీట్‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది.విజ‌య‌వాడ ఆర్ అండ్ బీ బిల్డింగ్‌లో ఈ రోజు మంత్రి సురేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే మంత్రి సురేష్ ప్రెస్ మీట్‌లో ఉండ‌గానే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ లోప‌లికి దూసుకోచ్చారు. అనంత‌పురం జిల్లాలో విద్యార్థుల‌పై జ‌రిగిన లాఠీ ఛార్జ్‌కి నిర‌స‌న తెలియ‌జేస్తూ విద్యార్థి సంఘాల నాయ‌కులు మంత్రిని ఘోర‌వ్ చేశారు. జ‌రిగిన ఘ‌ట‌న‌కి త‌క్ష‌ణం మంత్రి ఆదిమూల‌పు సురేష్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నేత‌ల ఆందోళ‌న ఉదృతంగా ఉండ‌టంతో భ‌ద్ర‌తా సిబ్బంది మంత్రి సురేష్‌ని తీసుకెళ్లారు. రాష్ట్రంలోని పిల్లలతో రాజకీయం చేయాలనుకుంటే ఖబడ్దార్ అని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. ఎయిడెడ్ వ్యవస్త గురించి అసలు తెలుసా అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ని ప్ర‌శ్నించారు. మీ రాజ‌కీయం కోసం పిల్లల జీవితాలతో ఆటలాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాకినాడ, వైజాగ్‌లో పేరెంట్స్‌తో ధర్నాలు చేయించారన్నారని మంత్రి సురేష్ ఆరోపించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో ఎవరితో ఆయినా చర్చలకు సిద్ధమని ఆయ‌న స‌వాల్ విసిరారు. తనను అడ్డుకొన్నవారు అసలు విద్యార్థులో, కాదో అని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. రాజకీయ ఎజెండాలకు విద్యార్థులు ఎవ‌రూ బ‌లికావొద్ద‌ని మంత్రి సూచించారు.

Also Read: కేంద్రం పై జగన్,కేసీఆర్ ,’ముందస్తు’ఫైట్

అనంతపురం ఘటన టీడీపీ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. కోవిడ్‌లో పరీక్షలు వద్దని అడ్డుకున్నారన్నారు. యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తామంటే చంద్రబాబు ఒప్పుకోవడం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ధర్నాలు మంచిది కాదన్నారు. సంస్కరణల్లో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. కొన్ని సంస్థల్లో అక్రమాలు జరిగాయన్నారు. నిన్న జరిగిన ఘటనను ఖండిస్తున్నానన్నారు. విద్యార్థుల ముసుగులో కొందరు రాళ్లు విసిరారని ఆయన ఆరోపించారు. రాళ్లు తగలడం వల్ల విద్యార్థులు గాయపడ్డారని, కానీ లాఠీచార్జ్‌ జరగలేదని మంత్రి సురేష్ తెలిపారు.

Also Read: చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే

అనంత‌పురంలో నిన్న విద్యార్థుల‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.ఎయిడెడ్ కాలేజీలు,స్కూళ్ల‌ను విలీనానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళ‌న చేసిన విష‌యం తెలిసిందే. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌కు నిరసనగా విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు యాజమాన్యం సెలవులు ప్రకటించింది. పోలీసులు లాఠీఛార్జ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలోకి తరలించారు. విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పాఠశాలలు, కళాశాలలు యధావిధిగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు.