విజయనగరం (Vizianagaram) జిల్లాలోని ప్రముఖ రఘు ఇంజనీరింగ్ కళాశాల(Raghu Engineering College)లో చోటుచేసుకున్న సంఘటన ప్రస్తుతం సమాజంలో చర్చనీయాంశంగా మారింది. తరగతిలో సెల్‌ఫోన్ వాడకం విషయమై ఓ లెక్చరర్ (Lecturer) విద్యార్థిని ఫోన్ తీసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థిని టీచర్‌తో వాగ్వాదానికి దిగింది. మాటల మద్యం పెరిగి, బూతులు తిడుతూ, చివరకు చెప్పుతో కొట్టడం వరకు వెళ్ళింది.
Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. శుభ సమయం ఇదే!
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫోన్ ధర రూ. 12,000 అని పేర్కొంటూ టీచర్‌ను నిందించిన విద్యార్థిని, శారీరక దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనను చూసిన వారు, విద్యార్థుల ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజుల్లో విద్యార్థుల నుంచి గురువులకు గౌరవం పూర్తిగా తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం విచారణ ప్రారంభించినట్లు సమాచారం. సంబంధిత టీచర్‌కు మద్దతుగా పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు సామాజిక మాధ్యమ వినియోగదారులు నిలబడుతున్నారు. విద్యా వ్యవస్థలో నైతిక విలువలు, గురు గౌరవం వంటి అంశాల పట్ల సమాజం తిరిగి ఆలోచించాల్సిన సమయం ఇది అని పలువురు పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
టీచర్ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్ని బూతులు తిడుతూ చెప్పుతో కొట్టిన విద్యార్థిని విజయనగరం -రఘు ఇంజనీరింగ్ కళాశాలలో టీచర్ ఓ విద్యార్థిని ఫోన్ తీసుకుందని..టీచర్‌తో వాగ్వాదానికి దిగిన స్టూడెంట్ ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో.. ఆ ఫోన్ 12 వేలు #HashtagU pic.twitter.com/4Q1ob1FMSY
— Hashtag U (@HashtaguIn) April 22, 2025