Weather Today : ఆగ్నేయ అరేబియా సముద్రంలో వారం కిందట ఏర్పడిన తుఫాను తరహా వాతావరణం ఇప్పటికీ అలాగే ఉంది. ఈ ప్రభావంతో తమిళనాడులో ఈరోజు నుంచి 17వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కేరళలో 16 నుంచి 18 వరకూ, లక్షద్వీప్‌లో 17, 18 తేదీల్లో వర్షాలు కురుస్తాయి.ఇవాళ కూడా అరేబియా మహా సముద్రం, హిందూ మహా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలో వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి నుంచి మేఘాలు కదిలి ఈరోజు మధ్యాహ్నసమయంకల్లా రాయలసీమ, కోస్తా ప్రాంతాలపై విస్తరిస్తాయి. సాయంత్రం సమయానికి ఆ మేఘాలు తూర్పు రాయలసీమ, దక్షిణ రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రవైపు వెళ్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే తెలుగు రాష్ట్రాలకు దీనివల్ల వర్ష సూచన లేదని స్పష్టం చేసింది.తెలంగాణ, పశ్చిమ రాయలసీమలో ఇవాళ రోజంతా ఎండ ఉంటుంది. గాలుల వేగం బాగా ఉంది. ఏపీలో గాలుల వేగం గంటకు 13 కిలోమీటర్లుగా, తెలంగాణలో గాలుల వేగం గంటకు 9 కిలోమీటర్లుగా ఉండొచ్చు. ఇక ఉష్ణోగ్రతలు తెలంగాణలో రాత్రిళ్లు మినిమం 17 డిగ్రీల సెల్సియస్, ఏపీలో రాత్రిళ్లు మినిమం 20 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సీయస్‌గా, ఏపీలో పగటి ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు, కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రం చలి ఎక్కువగా ఉండేలా(Weather Today) కనిపిస్తోంది.