Nara Lokesh : రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తగా కూటమి ప్రభుత్వం కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. దీని ద్వారా ఉద్యోగాలు, విద్య, వ్యాపారం, కుటుంబ అవసరాలు వంటి పలు కారణాల కోసం ప్రయాణించే మహిళలకు ఆర్థిక భారం తగ్గనుంది.
తాజాగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఈ పథకం అమలు కావడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాకుండా, అది వారి స్వేచ్ఛకు ప్రతీకగా, గౌరవానికి నిదర్శనంగా, అలాగే ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ప్రతిఫలంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Telangana Heavy Rains : భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడం తో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
“ఈ ఉచిత బస్సు టికెట్ కేవలం ఒక ప్రయాణ పాస్ కాదు. ఇది మహిళల సాధికారతకు ప్రతీక. సమాన అవకాశాల దిశగా వేస్తున్న ఒక పెద్ద ముందడుగు. స్త్రీ శక్తి పథకం ద్వారా మా ప్రభుత్వం మహిళా సాధికారతకు పట్టం కట్టింది” అని లోకేశ్ స్పష్టం చేశారు.
అలాగే, ఈ చారిత్రక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించే సమయంలో తమ టికెట్‌తో సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవాలని, ప్రపంచానికి మహిళా సాధికారత అంటే ఏమిటో చూపించాలని సూచించారు.
ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు, విద్యార్థినుల నుండి ఉద్యోగినుల వరకు, ప్రతి వర్గానికి చెందిన మహిళలు ప్రయోజనం పొందనున్నారు. దీని వల్ల వారి ప్రయాణ ఖర్చులు మాత్రమే తగ్గక, సమాజంలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
Charan House : రాజ భవనాన్ని తలపించేలా రామ్ చరణ్ ఇల్లు..ఇంటి ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!