Site icon HashtagU Telugu

Strange Marriage Custom : వరుడు యువతిలా.. వధువు యువకుడిలా మారిపోతారు.. వెరైటీ పెళ్లి సంప్రదాయం

Strange Marriage Custom Prakasam District

Strange Marriage Custom : మనదేశంలో పెళ్లిళ్లు నిర్వహించుకోవడంలో భిన్న, విభిన్న సంప్రదాయాలు అమల్లో ఉన్నాయి. ఒక్కోచోట ఒక్కో విధమైన వివాహ సంప్రదాయాన్ని ప్రజలు ఆచరిస్తుంటారు. కొన్నిచోట్ల ప్రజలు పాటించే వివాహ సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడిలోనూ ఇదే తరహా ట్రెడిషన్ ఒకటి నేటికీ ప్రజల ఆచరణలో ఉంది.

Also Read :Khatija Rahman : ‘‘మా నాన్న కెరీర్ గురించి అసత్య ప్రచారం ఆపండి’’: ఖతీజా రెహమాన్‌

శానంపూడిలో ఎవరైనా యువకుడు లేదా యువతికి పెళ్లి కుదిరితే .. ఒక రోజంతా జంబలకిడి పంబలా తిరగాల్సిందే. అదేనండి.. వరుడు, స్త్రీ వస్త్రధారణలో తిరగాలి. వధువు, పురుష వస్త్రధారణలో తిరగాలి.  ఆ విధంగా చక్కగా అలంకరించుకోవాలి. దుస్తులను పొందికగా ధరించాలి. అయితే ఈ సంప్రదాయాన్ని అక్కడి అన్ని కుటుంబాలు పాటించవు. శానంపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని పటికనేనివారి పాలెంలో నివసించే కోడిపల్లి అనే ఇంటి పేరు కలిగిన కుటుంబాలు మాత్రమే ఈ పద్ధతిని ఫాలో అవుతుంటాయి. ‘కోడిపల్లి’ అనే ఇంటిపేరుతో 100కుపైగా కుటుంబాలు  పటికనేనివారి పాలెంలో నివసిస్తున్నాయి. ఈ కుటుంబాల్లోని ఎవరైనా యువకుడికి పెళ్లి కుదిరితే.. చీర కట్టి అమ్మాయిలా తయారు చేస్తారు. అమ్మాయికి పెళ్లి కుదిరితే.. పంచె కట్టి, చొక్కా ధరింపజేస్తారు. యువకుడిలా ముస్తాబు చేస్తారు. అబ్బాయికి ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో గంధం ఇస్తారు.  అబ్బాయి బోనం ఎత్తుకొని కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ శివారులోని వీరుల జమ్మి చెట్టు వద్దకు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్తాడు. జమ్మి చెట్టుకు పూజలు చేస్తాడు.

Also Read :Fake Doctors Exposed : 100 మంది ఫేక్ డాక్టర్లు దొరికారు.. జనం ప్రాణాలతో చెలగాటం

ప్రతీ ఆచారం, సంప్రదాయం, సెంటిమెంటు వెనుక ఒక సైన్సు ఉంటుంది. ఇంతకీ ఈవిధమైన సంప్రదాయాన్ని(Strange Marriage Custom) ఇక్కడి ప్రజలు ఎందుకు ఆచరిస్తున్నారు అంటే.. స్థానికులు బలమైన కారణాలనే చెబుతున్నారు.  తమ కుటుంబాల్లో వంశాభివృద్ధి జరగాలనే ఆశయంతోనే ఈ ఆచారాన్ని పాటిస్తామని వంశ పెద్దలు తెలిపారు. తాము వందల ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నామని పేర్కొన్నారు.