Ration illegal transport : కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను అధికారుల సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలపై ఈనెల 29వ తేదీన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించిన విషయం తెలిసిందే. రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా షిప్ ను సీజ్ చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగంలో కదలివచ్చి స్టెల్లా షిప్‌ను సీజ్ చేశారు. కాగా, ఏపీ అధికారులు ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో కలెక్టర్ టీం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కాకినాడ కలెక్టర్ షన్మోహన్ మాట్లాడుతూ.. స్టెల్లా షిప్‌ను సీజ్ చేశాం అన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అంతేకాక..గోడౌన్ నుంచి షిష్‌లోకి వచ్చినవి రేషన్ బియ్యమా? కాదా? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకు వచ్చారు? షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తామని కాకినాడ కలెక్టర్ షన్మోహన్ హెచ్చరించారు. కాకినాడ పోర్టులో షిప్పులు తనిఖీ చేసే అధికారం తమకు ఉందని కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం షిప్ పోర్ట్ ఆఫీసర్ కస్టడీ ఉన్నట్లు తెలిపారు.
ఇటీవల షిష్‌లో రేషన్ బియ్యం ఎగుమతి అవుతుండడంతో అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. తొలుత 12.45గంటలకు యాంకరేజ్ పోర్టులో బార్జిలో తనిఖీలు చేశారు. నేరుగా పవన్ బార్జి ఎక్కి బియ్యం ప్లేటులో వేసి పరిశీలించారు. రేషన్ బియ్యం ఆనవాళ్లను గుర్తించారు. అక్కడే ఉన్న డీఎస్‌వో, కలెక్టర్, పోర్టు అధికారి, ఇతర అధి కారులపై తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ మాఫి యాకు మీరంతా సహకరించకపోతే ఇలా ఎలా దేశాలు దాటిపోతోందని మండిపడ్డారు. ఉద్యోగాలు చేస్తున్నారా.. మాఫియాకు వంత పాడుతున్నారా? అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్త చేశారు.
Read Also: Minister: ఆర్ధిక ఇబ్బందులతో ఏ ఒక్కరి చదువు ఆగిపోవద్దు: మంత్రి