Site icon HashtagU Telugu

Stampede Mystery : చంద్ర‌బాబు స‌భ‌ల్లో తొక్కిస‌లాట‌ మిస్ట‌రీ! పోలీస్ ఆరా !

Y Not 160

Chandrababu

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు రోడ్ షోలు, స‌భ‌ల‌పై (Stampede Mystery) ప్ర‌భుత్వం సీరియ‌స్ గా పోస్ట్‌మార్టం చేసింది. ఆయ‌న స‌భ‌ల‌ను రాజ‌కీయ కోణం నుంచి చూస్తోంది. జ‌నాన్ని(Public) త‌ర‌లిస్తున్నార‌ని నిర్థారించ‌డానికి సిద్దం అయింది. ఉద్దేశ‌పూర్వ‌కంగా తొక్కిస‌లాట జ‌రిగేలా చేస్తున్నార‌ని అనుమానిస్తోంది. ప‌బ్లిసిటీ పిచ్చితో చంద్ర‌బాబు చేస్తోన్న ఈవెంట్స్ గా చిత్రీక‌రించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. డ్రోన్ కెమెరాల్లో జ‌నాన్ని బంధించేందుకు ఇరుకు సందుల్లో జ‌నాన్ని ఉంచుతున్నార‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్థార‌ణ‌కు వ‌స్తున్నారు. ఆ మేర‌కు నివేదిక‌లు  (Stampede Mystery) త‌యారు అయిన‌ట్టు పోలీసు వ‌ర్గాల్లోని వినికిడి.

తొక్కిస‌లాట జ‌రిగేలా..(Stampede Mystery)

గుంటూరు స‌భ తొక్కిస‌లాట‌కు ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస‌రావును ఏపీ పోలీస్ బాధ్యుడ్ని చేసింది. విజయవాడ ఏలూరు రోడ్ లోని ఓ హోటల్ లో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఐటీ నిపుణుడిగా పనిచేసిన శ్రీనివాసరావు కొంతకాలం కిందట స్వదేశానికి వచ్చేశారు. ఆయన గుంటూరులోనూ, హిందూపురంలోనూ అన్న క్యాంటీన్లు కూడా నిర్వహిస్తున్నారు. ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన గుంటూరు వికాస్ న‌గ‌ర్ లో జ‌రిగిన చంద్ర‌బాబు స‌భ‌లో ఆయ‌న చంద్ర‌న్న కానుక‌లు అందించాల‌ని అనుకున్నారు. ఆ మేర‌కు చంద్ర‌బాబు స్పీచ్ ముగిసిన త‌రువాత కానుక‌ల పంపిణీ ప్రారంభించారు. స్పీచ్ ముగించుకుని వెళుతోన్న చంద్ర‌బాబు జ‌నాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. తోసుకోకుండా కానుక‌లు తీసుకోండ‌ని హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ జ‌నం చంద్ర‌న్న కానుక‌ల కోసం ఎగ‌బ‌డ్డారు. బారీకేడ్ల‌ను తోసుకుంటూ జ‌నం వెళ్లారు. దీంతో అదుపు తప్పి ముగ్గురు మ‌హిళ‌లు దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌ర‌ణించారు. నెల్లూరు జిల్లా కందుకూరు స‌భలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 8మంది మ‌ర‌ణించిన ఉదంతాన్ని మ‌రువ‌క‌ముందే గుంటూరు స‌భ‌లో ముగ్గురు మ‌ర‌ణించ‌డాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుంది.

Also Read : Chandrababu Sabha Stampede: చంద్రబాబు సభలో అపశృతి..7గురు మృతి!

వాస్త‌వంగా గ‌త కొన్ని రోజులుగా చంద్ర‌బాబు స‌భ‌ల‌కు జ‌నం(Public) విర‌గ‌బ‌డి వ‌స్తున్నారు. మ‌హిళ‌లు, వృద్ధులతో పాటు యువ‌త ఎక్కువ‌గా హాజ‌ర‌వుతోంది. `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి నంద్యాల మొద‌లుకొని గోదావ‌రి జిల్లాల మీద‌గా ఉత్త‌రాంధ్ర వ‌ర‌కు ప‌లు చోట్ల జ‌నం నీరాజ‌నం ప‌ట్టారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజాంలో జ‌రిగిన స‌భ పీక్స్ గా చెప్పుకోవాలి. ఆ స‌భ కు ఏ మాత్రం తీసిపోని విధంగా బాప‌ట్ల‌, గుంటూరు, కందుకూరు స‌భ‌లు జ‌రిగాయి. నెల్లూరు జిల్లా కోవూరు, కావ‌లి..ఇలా రోడ్ షోలు ఎక్క‌డ జ‌రిగినా, జ‌నం బారులు తీరారు. చంద్ర‌బాబును అనురిస్తూ గంట‌ల కొద్దీ ఆయ‌న చెప్పే స్పీచ్ ను ఉత్సాహంగా విన్నారు. కేరింత‌లు కొట్టారు. ఏపీ ప్ర‌భుత్వంపై ఆయ‌న విరుచుకుప‌డుతోన్న తీరును ఆశ్వాదించారు. చంద్ర‌బాబు స్పీచ్ కు అనుగుణంగా చ‌ప్ప‌ట్లు, కేరింత‌లు, సెల్ ఫోన్ వెలుగులు క‌నిపించాయి. మునుపెన్న‌డూ ఆయ‌న స‌భ‌ల్లో క‌నిపించ‌నంత‌గా జ‌నం నుంచి స్పంద‌న క‌నిపించింది. ఆ విష‌యాన్ని కేంద్ర‌, రాష్ట్రా నిఘా వ‌ర్గాలు కూడా అంగీక‌రిస్తున్నాయి. వాళ్లు ఇచ్చిన నివేదిక‌ల‌ను ప‌రిశీలించిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చంద్ర‌బాబు స‌భ‌ల మీద ప్ర‌త్యేక నిఘా పెట్టింది.

భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల్సిన బాధ్య‌త పోలీసుల‌పై..

బహిరంగ్ స‌భ‌లు, రోడ్ షోల‌కు ముందుగా పోలీసులు అనుమ‌తి ఉంటుంది. ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ అధికారికంగా పోలీసులకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటోంది. ఆ మేర‌కు పోలీసులు అప్ర‌మ‌త్తం కావాలి. ఎంత మంది జ‌నం హాజ‌రు అయ్యే అవ‌కాశం ఉందో, అంచ‌నా వేయాలి. భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల్సిన బాధ్య‌త పోలీసుల‌పై ఉంటోంది. పైగా చంద్ర‌బాబునాయుడు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీలో ఉన్న నాయ‌కుడు. ఆయ‌న‌కు, ఆయ‌న స‌భ‌ల‌కు ప్ర‌త్యేకంగా భ‌ద్ర‌త‌ను ఇవ్వాలి. కానీ, పోలీసుల అంచ‌నాల‌ను మించి జ‌నం వ‌స్తున్నారు. కందుకూరు సంఘ‌ట‌న త‌రువాత‌నైనా పోలీసులు గుంటూరు స‌భకు వ‌చ్చే జ‌నం సంఖ్య‌ను అంచ‌నా వేయ‌లేక‌పోయారు. పైగా కానుక‌లు కూడా ప్ర‌క‌టించ‌డంతో అనూహ్యంగా జ‌నం హాజ‌ర‌య్యారు. ఫ‌లితంగా తొక్కిస‌లాట జ‌రిగింది. దీనికి ప్రాథ‌మికంగా పోలీసులు బాధ్య‌త వ‌హించాలి.

Also Read : NCBN: అధికారంలోకి వస్తే 3వేల పెన్షన్ : గుంటూరు సభలో చంద్రబాబు

చంద్ర‌బాబు స‌భ‌ల్లో వ‌రుస‌గా జ‌రిగిన దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న‌ల‌పై టీడీపీ మ‌థ‌న‌ప‌డుతోంది. జ‌నాన్ని చూసి మొన్న‌టి వ‌ర‌కు రెట్టించిన ఉత్సాహంతో ఉన్న చంద్ర‌బాబు కూడా దుర్ఘ‌ట‌న‌ల‌తో క‌ల‌త చెందారు. వ‌రుస సంఘ‌ట‌న‌ల వెనుక రాజ‌కీయ కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా? అనే ఆలోచ‌న కూడా టీడీపీ చేస్తోంది. వేలాది మంది జ‌నం వ‌చ్చిన‌ప్పుడు ఒక‌రిద్ద‌రు హ‌డావుడి చేసినా, తొక్కిస‌లాట‌కు స‌హ‌జంగా కార‌ణం అవుతుంది. అలాంటి ప‌రిణామం చోటుచేసుకుంటుందా? అనేది కూడా టీడీపీ ప‌రిశీలిస్తోంది. ప్ర‌భుత్వం మాత్రం చంద్ర‌బాబు ప‌బ్లిసిటీ పిచ్చ‌తో జ‌నాన్ని చంపేస్తున్నార‌ని ఆరోప‌ణ‌ల‌కు తెగ‌బ‌డుతోంది. గుంటూరు సంఘ‌ట‌న‌పై ఉయ్యూరు శ్రీనివాస‌రావును అరెస్ట్ చేసిన పోలీసులు నిజాల‌ను నిగ్గు తేల్చ‌గ‌లరా? లేక వైసీపీ నేత‌ల అరోప‌ణ‌ల‌కు అనుగుణంగా విచార‌ణ చేస్తారా? అనేది చూడాలి.