Srisailam: శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు, ఒక్కరోజే 50 వేల మంది దర్శనం

ఒక్కరోజు దాదాపు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. 

Published By: HashtagU Telugu Desk
Srisailam1

Srisailam1

శ్రీశైలంలోని (Srisailam) శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం దర్శనం కోసం భక్తులు తరలివస్తన్నారు. ఒకవైపు వరుస సెలవులు ఉండటం, మరోవైపు సమ్మర్ హాలిడేస్ కుడా ఉండటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. శివుడి దర్శన కోసం ఆదివారం భక్తులు క్యూ కట్టారు. శనివారం సాయంత్రం నుంచే భక్తుల రాకతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా శివ నామస్మరణతో శ్రీశైలం మార్మోగిపోయింది. నిన్న ఒక్కరోజు దాదాపు 50 వేల మంది భక్తులు (Devotees) స్వామివారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది.

సోమవారం నాటికి లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రద్దీని అదుపు చేయడంలో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ .లవన్న మాట్లాడుతూ.. సందర్శకుల సౌకర్యార్థం అధికారులు వసతి, భోజనం, తాగునీరు ఏర్పాట్లు చేశామని, సాధారణ దర్శనానికి ఐదు నుంచి ఆరు గంటలు, ప్రత్యేక దర్శనానికి (Darshan) మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టిందని తెలిపారు.

Also Read: MLC Kavitha: తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప ఫలితాలు: ఎమ్మెల్సీ కవిత

  Last Updated: 05 Jun 2023, 03:43 PM IST