Jagan Assets: సుప్రీంకు మళ్లీ శ్రీలక్ష్మి వ్యవహారం! జగన్ ఆస్తుల కేసు స్పీడ్

ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి ని సీబీఐ వేటాడుతుంది.

  • Written By:
  • Updated On - February 20, 2023 / 04:36 PM IST

ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి ని సీబీఐ వేటాడుతుంది. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించినప్పటికి సుప్రీం కోర్టులో ఆమె భవిష్యత్ తేలనుంది. తాజాగా ఆమెపై ఉన్న కేసులపై సుప్రీం కోర్ట్ లో సీబీఐ పిటిషన్ వేసింది. దీంతో కేసుల వ్యవహారం మరోసారి సీరియస్ అయింది. తాజాగా గవర్నర్ నజీర్ రావటం, ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోక ముందే యూనివర్శిటీ వీసీ ల నియామకం, జాతీయ విద్యా విధానం పై కేంద్రం నివేదిక కోరింది. ఈ పరిణామాలు జగన్ (Jagan) కు ప్రతికూలంగా ప్రత్యర్థులు భావిస్తున్నారు.

జగన్ (Jagan) అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ వేయటం చర్చనీయాంశంగా మారింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పేరును తొలగించిన తెలంగాణ హైకోర్టు అభిప్రాయాన్ని కాదని ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఉందంటూ సుప్రీంలో సీబీఐ పిటిషన్ వేసింది. ఆమెను వదలకూడదని పిటిషన్ లో సీబీఐ కోరింది.జగన్ అక్రమాస్తుల కేసు సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని వెంటాడుతూనే ఉంది. ఈ కేసు నుంచి ఆమెను వదిలిపెట్టకూడదని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఓబులాపురం ఐరన్ ఓర్ కంపెనీకి సంబంధించి గనుల కేటాయింపు విషయంలో శ్రీలక్ష్మి పాత్ర ఉందని పిటిషన్ లో పేర్కొంది. ఈ కేసులో ఆమెను విచారించాల్సిందేనని తెలిపింది. మరోవైపు ఈ కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. కేసు నుంచి ఆమె పేరును తొలగించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Also Read:  Chicken: రోజూ చికెన్ తినొచ్చా? తినకూడదా? నిపుణులు ఏమంటున్నారు?