Summer Spl Trains: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని మే, జూన్ నెలల్లో హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మే 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి రామేశ్వరం (07695)కు.. మే 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి శుక్రవారం రామేశ్వరం నుంచి సికింద్రాబాద్ కు (07696) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అదేవిధంగా మే 12 నుంచి జూన్ 2వ తేదీ వరకు ప్రతి సోమవారం కాచిగూడ నుంచి మధురై (07191)కు, మే 14 నుంచి జూన్ 4వ తేదీ వరకు ప్రతీ బుధవారం రామేశ్వరం నుంచి కాచిగూడకు (07192) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.
Also Read: TTD: సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
మరోవైపు.. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. విశాఖ- తిరుపతి, భువనేశ్వర్- యశ్వంత్‌పూర్ మధ్య నడుస్తున్న రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
విశాఖ – తిరుపతి రైలు..
◊ విశాఖ-తిరుపతి (08583) రైలు ప్రతి సోమవారం నడుస్తుంది. దీని గడువును మే 5వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు.
◊ తిరుగు ప్రయాణంలో (08584) మంగళవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. జులై 1 వరకు దీని గడువు పొడిగించారు. మొత్తం 18 ట్రిప్పులు నడవనున్నాయి.
◊ ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
భువనేశ్వర్ – యశ్వంత్‌పూర్ రైలు..
◊ భువనేశ్వర్- యశ్వంత్‌పూర్ (02811) రైలు మే 24 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.
◊ తిరుగు ప్రయాణం (02812) ప్రతి సోమవారం జూన్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. మొత్తం 12 ట్రిప్పులు తిరుగుతుంది.
◊ ఈ రైలు ఖుర్దా రోడ్డు, బ్రహ్మపుర, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం, ఎస్‌ఎస్‌ఎస్‌పీ నిలయం, హిందూపురం స్టేషన్లలో ఆగుతుంది.
Summer Special Trains extended pic.twitter.com/XyhOvklhLU
— South Central Railway (@SCRailwayIndia) April 22, 2025