MLA Kota: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ వీడింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును ప్రకటించింది. ఈరోజు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీకి 3, జనసేన, బీజేపీలకు ఒక్కొక్కటి చొప్పున సీట్లు సర్దుబాటు ఇప్పటికే జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నేటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగియనుంది.
Read Also: Shock To Lalit Modi: భారత్ ఎఫెక్ట్.. లలిత్ మోడీకి వనౌతు పాస్‌పోర్ట్ రద్దు
కాగా, సోమువీర్రాజు 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆయన తరువాత దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చివరి నిమిషం వరకు బీజేపీ సీనియర్ నేత పాకాల సత్యనారాయణ, సోమువీర్రాజు విషయంలో పార్టీ హైకమాండ్ కాస్త తర్జనభర్జనకు గురైనప్పటికీ చివరకు సోమువీర్రాజు పేరునే ఖరారు చేసింది అధిష్టానం. కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అసెంబ్లీలోని కమిటీ హాల్ నెంబర్ 2లో నామినేషన్ వేయనున్నారు సోమువీర్రాజు. దీనికి సంబంధించి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక, జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఖరారు చేసింది. టీడీపీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ ఆదివారం ప్రకటించింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరికి, ఎస్సీ సామాజికవర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు చెరో స్థానాన్ని కేటాయించింది. కాగా, ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమిలో టీడీపీకు 3, జనసేన, బీజేపీలకు ఒక్కొక్కటి చొప్పున సీట్ల సర్దుబాటు జరిగింది.
Read Also: Bhupesh Baghel : భూపేష్ బఘేల్, చైతన్య బఘేల్ నివాసాల్లో ఈడీ రైడ్స్