Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో స్వల్ప మార్పులు

CM Chandrababu

CM Chandrababu

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఈనెల 12న (బుధవారం) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నాారు.  12వ తేదీన  ఉదయం 11. 27 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసపల్లి ఐటీ పార్క్ వేదికగా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత ఏపీ సీఎంవో ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అయితే తాజాగా ప్రమాణ స్వీకార సమయంలో చిన్నపాటి మార్పులు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

కొత్త అప్‌డేట్ ప్రకారం.. ఈ నెల 12న ఉదయం 9. 27 గంటలకు చంద్రబాబు(Chandrababu)ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈవిషయాన్ని ఏపీ సీఎంవో తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు సీఎంగా, డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేస్తారని వెల్లడించింది. మరో 20 మందికి పైగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మంత్రులుగా టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి ఎంతమందికి.. ఎవరెవరికి  అవకాశం దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read :Narendra Modi : గాంధీ, వాజ్‌పేయికి మోడీ నివాళులు.. నేడే ప్రధానిగా ప్రమాణం

ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలోని దాదాపు పన్నెండు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు రానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.పార్కింగ్‌ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్‌ రోడ్లు వేస్తున్నారు.

Also Read :Sreeleela : బాలీవుడ్‌కి వెళ్తున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరో వారసుడికి జోడిగా..

కేంద్రంలో ఏర్పాటుకాబోతున్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కింగ్ మేకర్‌గా మారారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరికి చెందిన ‘హెరిటేజ్ ఫుడ్స్’ స్టాక్ మార్కెట్ షేర్ల విలువ జూన్ 4 నుంచి జూన్ 8 మధ్యకాలంలో.. అంటే కేవలం ఐదు రోజుల్లోనే రూ.584 కోట్లు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరికి 24.37 శాతం వాటా ఉంది. ఆమె పేరిట 2,26,11,525 హెరిటేజ్ ఫుడ్స్‌ షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీ ప్రమోటర్లలో ఆయన కుమారుడు నారా లోకేష్ ఒకరు.  ఈ ఏడాది మే 31న హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర రూ.402.90 ఉండగా..  ప్రస్తుతం అది రూ.661.25 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read :Railway Ticket Prices: రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. త‌గ్గ‌నున్న టికెట్ ఛార్జీలు..!