Andhra Pradesh: తిరుపతిలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు

Published By: HashtagU Telugu Desk
Andhra Pradesh

New Web Story Copy 2023 07 09t190418.347

Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. శ్రీకాళహస్తిలోని మిట్టకండ్రిగ సమీపంలో ట్రక్కును ఎస్‌యూవీ కారు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలు మరియు ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.

తిరుమల దర్శనం అనంతరం తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి ఎస్‌యూవీలో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. బాధితులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతులను రమేష్, నరసింహమూర్తి, రాజ్యలక్ష్మి, శ్రీలత, అక్షయ, వెంకట రమణమ్మగా గుర్తించారు. బాధితులు శ్రీకాళహస్తి రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుండగా మిట్టకండ్రిగ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్కుని కారు ఢీకొందని పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More: Cluster Bombs Explained : క్లస్టర్ బాంబులపై దుమారం.. ఎందుకు ? ఏమిటవి ?

  Last Updated: 09 Jul 2023, 07:06 PM IST