AP liquor Scam : లిక్కర్ స్కాంలో సంపాదించింది డబ్బు కాదు.. ప్రజల రక్త మాంసాలు

AP liquor Scam : వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు చేస్తూ, బ్యాంకింగ్ వ్యవస్థను ఏది ముట్టకుండా నగదు లాండరింగ్‌కు పాల్పడ్డారు. ఇది చట్టవ్యతిరేకం, అనైతికం. ఇప్పుడవి బయటకు వస్తున్నప్పటికీ, కోర్టుల్లో ఏడుపులు, మీడియా ముందు బెదిరింపులు చేయడం ఈ నేతల నయవంచక ధోరణిని వివరిస్తోంది

Published By: HashtagU Telugu Desk
Sit Uncovers Key Evidence,

Sit Uncovers Key Evidence,

ప్రజలు ఎంతో విశ్వాసంతో ఇచ్చిన అధికారాన్ని వైసీపీ ప్రభుత్వం (YCP Govt) దుర్వినియోగం చేస్తూ, తమ వ్యక్తిగత స్వార్థాల కోసం గత పాలకులు ఎలా ప్రజల రక్తమాంసాలను పీల్చుకున్నారో ఒక్కొక్కటిగా బయటపడుతోంది. వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు చేస్తూ, బ్యాంకింగ్ వ్యవస్థను ఏది ముట్టకుండా నగదు లాండరింగ్‌కు పాల్పడ్డారు. ఇది చట్టవ్యతిరేకం, అనైతికం. ఇప్పుడవి బయటకు వస్తున్నప్పటికీ, కోర్టుల్లో ఏడుపులు, మీడియా ముందు బెదిరింపులు చేయడం ఈ నేతల నయవంచక ధోరణిని వివరిస్తోంది.

చెవిరెడ్డి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి భారీ నగదు లావాదేవీలను క్యాష్ హ్యాండ్లర్‌గా నిర్వహించేవాడు. లావాదేవీలన్నింటినీ వీడియో తీసి చెవిరెడ్డికి పంపించి, వెంటనే డిలీట్ చేసే సిస్టమ్ ఉండేది. కానీ టెక్నాలజీ వల్ల ఈ వీడియోలు పూర్తిగా తుడవబడలేవు. ఒకటి బయట పడింది అంటే.. ఇంకెన్నో దాగి ఉన్నాయి అన్నది స్పష్టం. ఇప్పుడు ఎస్ఐటీ అధికారులు వాటిని వెలికితీసే పని చేస్తున్నారు. వందలాది వీడియోలు దొరకడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tragedy : గ్రానైట్ రాళ్లు విరిగిపడి, ఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు..

రెండు వేల రూపాయల నోట్లను ఆర్బీఐ మార్కెట్‌ నుంచి ఉపసంహరించినా, మొత్తం నోట్లలో 98 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. మిగతా రూ.6 వేల కోట్ల నోట్లకు ముద్రలేని దొంగ దారి వెతుకుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నోట్లు ఎక్కడున్నాయన్న ప్రశ్నను కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ డబ్బును డెన్‌లలో దాచిపెట్టారని, బయటకు తీస్తే అసలు దొంగతనాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు.

లిక్కర్ స్కాంలో లాభాలు కోరి, చీప్ లిక్కర్‌ని అధిక ధరలకు అమ్మి ప్రజల ఆరోగ్యాలను తక్కువచేసి చూడటం నేరమో తప్పో తెలియని దోపిడీ రాజకీయాన్ని చేసిన నేతలు ఇప్పుడు ఒడిసి పడుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని దోచుకొని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడారు. వేల కోట్లను దండుకొని ప్రజల జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు ఆ నేరాలకు ప్రజల శాపాలు వెంటాడుతున్నాయి. న్యాయంగా, సామాజికంగా ఈ దోపిడీకి మూల్యాన్ని చెల్లించే సమయం దూరంగా లేదని తెలుస్తోంది.

  Last Updated: 03 Aug 2025, 04:24 PM IST