Site icon HashtagU Telugu

Anil Kumar Singhal : TTD ఈవోగా మరోసారి సింఘాల్

Anil Kumar Singhal Ttd

Anil Kumar Singhal Ttd

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీల్లో అత్యంత ముఖ్యమైనది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) పదవి. గతంలో 2017 నుంచి 2020 వరకు టీటీడీ ఈవోగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) మరోసారి అదే పదవిలోకి బదిలీ అయ్యారు. గతంలో ఆయన టీటీడీలో సమయ నిర్ధారిత దర్శన టోకెన్లు (టైమ్ స్లాట్ దర్శన్) వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.

అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటుకు కూడా కీలక పాత్ర పోషించారు. శ్రీవారి సేవలో భాగమయ్యేలా భక్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్ట్ను స్థాపించారు. దీని ద్వారా టీటీడీ ఖజానాకు ప్రతి నెలా దాదాపు రూ.450 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అలాగే, టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను గుర్తించడం కోసం సర్వే చేయించారు. 2020లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయనను ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది.

ఈ బదిలీల్లో మరికొందరు ముఖ్యమైన అధికారులు కూడా ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా సౌరభ్ గౌర్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిగా శ్యామల రావు, అలాగే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయని భావిస్తున్నారు.

బదిలీలు వీరే..

జి. అనంత రాము : పర్యావరణ అటవీ విభాగం నుంచి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం

అనిల్ కుమార్ సింఘాల్ : తిరుమల తిరుపతి దేవస్థానాల ఈఓగా నియామకం

ఎంటీ కృష్ణబాబు : హెల్త్ విభాగం నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదిలీ. అదనంగా ఇన్‌ఫ్రా, పెట్టుబడుల బాధ్యతలు కూడా

జె. శ్యామలారావు : టీటీడీ నుంచి వెనక్కి పిలిచిన ప్రభుత్వం జీఏడీ (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం

ముఖేశ్ కుమార్ మీనా : జీఏడీ నుంచి రెవెన్యూ (ఎక్సైజ్) విభాగానికి బదిలీ. అదనంగా మైన్స్ విభాగం బాధ్యతలు కూడా

కాంతిలాల్ దాండే : రోడ్లు, భవనాల నుంచి పర్యావరణ, అటవీ విభాగానికి బదిలీ

సౌరభ్ గౌర్ : పౌర సరఫరాల శాఖ నుంచి హెల్త్ శాఖ సెక్రటరీగా, సివిల్ సప్లైస్ అదనపు బాధ్యతలు కొనసాగింపు

ప్రవీణ్ కుమార్ : మైన్స్ నుండి ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ

సీహెచ్ శ్రీధర్ : మైనారిటీస్ వెల్ఫేర్ సెక్రటరీగా నియామకం కమిషనర్ బాధ్యతలు అదనంగా

ఎంవీ శేషగిరి బాబు : లేబర్ విభాగం సెక్రటరీగా, కమిషనర్ బాధ్యతలు అదనంగా.

ఎం హరి జవహర్ లాల్ (రిటైర్డ్): గవర్నర్ కార్యాలయం నుంచి రెవెన్యూ (ఎండోమెంట్స్) విభాగానికి బదిలీ

Read Also : KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?