Lokesh : రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చేసిన నాలుగు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి సంపాదించడంలో లోకేశ్ పాత్ర కీలకంగా నిలిచింది. గురువారం ఉదయం ఆయన రాష్ట్రానికి బయలుదేరిన సందర్భంగా అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌తో అనుభవించిన చేదు అనుభూతులను మర్చిపోయేలా చేసిన లోకేశ్ ప్రయత్నాలు పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం గమనార్హం. సింగపూర్ ప్రభుత్వం, కార్పొరేట్ ప్రముఖుల నుంచి వచ్చిన స్పందన ఏపీకి తిరిగి నమ్మకాన్ని తీసుకువచ్చింది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో కలిసి, స్వతంత్రంగా కూడా మంత్రి లోకేశ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Read Also: Kushboo Sundar: బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ
ఈ నాలుగు రోజుల్లో ఆయన 35 పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాటిలో 19 వన్ టు వన్ పారిశ్రామిక చర్చలు, 6 గవర్నమెంట్ టు గవర్నమెంట్ సమావేశాలు, 4 రౌండ్ టేబుల్ చర్చలు, 4 సైట్ విజిట్లు మరియు 2 డయాస్పోరా ఈవెంట్లు ఉన్నాయి. ప్రతీ సమావేశం రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించే దిశగా సాగింది. సింగపూర్ ప్రభుత్వ పెద్దల నుండి ప్రారంభించి అక్కడి తెలుగు వలసవాదుల వరకు ఏపీ బృందానికి అపూర్వ ఆదరణ లభించింది. ముఖ్యంగా జులై 27న ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేశ్ చేసిన ప్రసంగం ఎన్‌ఆర్‌ఐల్లో కొత్త శక్తిని నింపింది. ఏపీ బ్రాండ్ ప్రమోషన్‌లో మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి అనే ఆయన పిలుపు ఎంతో ప్రేరణాత్మకంగా నిలిచింది. ప్రపంచ స్థాయి సంస్థలైన గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్, ఎయిర్ బస్, మురాటా ఇంజనీరింగ్, ఎవర్ వోల్ట్, కెరియర్, ఇన్ఫినియన్, క్యాపిటా ల్యాండ్, ఐవీపీ సెమి, ఎబీమ్ కన్సల్టింగ్, డీటీడీఎస్ సంస్థల ప్రతినిధులతో లోకేశ్ జతగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఏపీలో పరిశ్రమలకు ఉన్న అనుకూల పరిస్థితులు, ప్రోత్సాహక విధానాలు, వేగవంతమైన అనుమతుల ప్రక్రియలను ఆయన వివరిస్తూ నిక్షిప్తంగా ముందుకు సాగారు.
ఏపీ సర్కారు ఇచ్చే సహకారం, సులభతర వాణిజ్య విధానాల వల్ల పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడంలో ఆసక్తి చూపుతున్నాయని పర్యటనలో స్పష్టమైంది. కంపెనీలు తమ టాప్ మేనేజ్‌మెంట్‌తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. జూలై 28న నిర్వహించిన ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరంలో లోకేశ్ చేసిన స్పష్టమైన హామీ ఎంఓయూపై సంతకం జరిగిన తర్వాత సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యే వరకు పూర్తి బాధ్యత మా ప్రభుత్వమే వహిస్తుంది పరిశ్రమలలో నమ్మకాన్ని నింపింది. గత ప్రభుత్వ కాలంలో నష్టపోయిన బ్రాండ్ ఏపీని మళ్లీ గౌరవప్రదంగా నిలబెట్టేందుకు లోకేశ్ తీసుకున్న చర్యలు ఫలవంతమయ్యాయి. అమెరికా, దావోస్ పర్యటనల అనంతరం సింగపూర్ పర్యటన కూడా విజయవంతంగా ముగియడం రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకురాగా, విదేశీ పెట్టుబడుల రాకకు దారితీసే కీలక ఘట్టంగా నిలిచింది.