Actor Naresh : ఏపీ రాజకీయాలపై నటుడు నరేష్‌ సంచలన వ్యాఖ్యలు..!

లీడ్ ప్లేయర్లంతా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏపీ రాజకీయాలు గందరగోళ పరిస్థితి నెలకొంది.

  • Written By:
  • Updated On - April 3, 2024 / 10:02 AM IST

ఏపీలో రాజకీయం రాజుకుంటోంది. ఏపీలో ఎన్నికల వేడి వేసవి వేడిని బీట్‌ చేస్తోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేతృత్వంలోని అధికార వైఎస్సార్‌సీపీ (YSRCP), మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రతిపక్ష టీడీపీ (TDP) ఈ ఎన్నికల్లో గెలిచేందుకు హోరాహోరీగా పోరాడుతున్నాయి. సీఎం జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఒంటరి పోరు సాగిస్తుండగా, టీడీపీకి చెందిన చంద్ర బాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీ (Janasena Party), ప్రధాని మోదీ (Narendra Modi) బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకున్నారు. ఈ మధ్య జగన్ సోదరి వైఎస్.షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ (Congress)లో చేరి తన సోదరుడు జగన్‌పై పోటీ పడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

లీడ్ ప్లేయర్లంతా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏపీ రాజకీయాలు గందరగోళ పరిస్థితి నెలకొంది. వీటన్నింటి మధ్యలో సీనియర్‌ నటుడు, బీజేపీ నేత నరేష్ (Actor Naresh) ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అద్భుతమైన విశ్లేషణ.. అంచనాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో అధికార మార్పిడికి ముందు పెద్ద రక్తపాతం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నా నమ్మకం’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు నరేష్‌. అయితే.. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, టీడీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీలు వైఎస్సార్‌సీపీ సామూహిక హత్యలకు పాల్పడుతోందని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, ఉచితాలతో ప్రజలను సోమరులుగా మారుస్తున్నాయని, వివిధ మాఫియాలకు పాల్పడుతూ ప్రజలను దోచుకుని ఖజానాను దివాళా తీస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు టీడీపీ చేస్తోన్న పనిని ప్రజల్లోకి ప్రతికూలంగా తీసుకుపోయేందుకు అధికార వైసీపీ శక్తికి మించి శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. టీడీపీ మద్దతుదారులను బెదిరించి, కేసులు పెట్టి తమవైపు లాక్కొవడానికి ప్రయత్నాలూ చేస్తోందనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. అయితే.. బుజ్జగింపులకు విననివారిపై దాడులకు సైతం దిగుతున్నారనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణలు. వీటన్నింటినీ కేంద్రీకృతం చేస్తూ నరేష్‌ చేసిన వ్యాఖ్యలు ఉటంకిస్తూ.. ఏపీలోని రాజకీయవర్గాలు ఆలోచనలో పడ్డాయి.
Read Also : Health Tips : ఆరోగ్యకరమైన శరీరం కోసం ఈ 5 ఆహారాలు తినండి..!