I-PAC Service: ఐ ప్యాక్… 2019లో వైసీపీ విజయానికి ఎంతటి కీలక పాత్ర పోషించిందో, 2024లో జగన్ ఓటమికి దాని బాధ్యత కూడా అంతే ఉందని చెబుతారు రాజకీయ పరిశీలకులు.. జగన్‌కి కర్త, కర్మ, క్రియలా మారి, ఆయన అడుగడుగుని, ప్రచార బాధ్యతలని, స్పీచ్‌లని నిర్ణయించేంది ఐ ప్యాక్ అనే ప్రచారం ఉంది.. ఈ ఐ ప్యాక్‌ని తొలగించాలని, జగన్ ప్రజలకు దగ్గర కావాలంటే, ఆయన పొలిటికల్ గ్రాఫ్ పెరగాలంటే, ఐ ప్యాక్‌ని తాడేపల్లి ప్యాలెస్ నుండి పంపించేయాలని మండిపడుతున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఐ ప్యాక్ వ్యూహాలు జగన్‌కి గుదిబండలా మారుతున్నాయని, ఆయన ఇమేజ్‌ని తగ్గిస్తున్నాయని అభిప్రాయ పడుతున్నారు..
ఐ ప్యాక్ హెడ్‌గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్న సమయంలో ఆయనే జగన్‌కి గైడ్‌గా వ్యవహరించేవారు.. ఆయన అక్కడ నుండి తప్పుకున్న తర్వాత, ఆ బాధ్యతలను కొత్త టీమ్ తీసుకుంది.. ఈ టీమ్.. వినూత్న విధానాలను, కొత్త ఆలోచనలను, వ్యూహాలను అనుసరించడం లేదని, ఫెయిల్ అయిన రాంగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.. ఇవి జగన్‌కి మైలేజ్ తీసుకురాకపోగా, నెగిటివ్‌గా మారుతున్నాయని వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు..
Also Read: Minister Uttam Kumar Reddy: ప్రమాద స్థలానికి మంత్రులు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తమ్, జూపల్లి
ఇటీవల వైసీపీ అధినేత జగన్…. జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చారు.. అక్కడ ఐ ప్యాక్ ప్రీ ప్లాన్‌గా క్రియేట్ చేసిన సీన్ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలనే విస్మయానికి గురి చేసింది.. ఓ పదేళ్ల స్కూల్ బాలికని జగన్ ప్రెస్ మీట్ పెట్టిన ప్రదేశానికి తీసుకువచ్చి ఒక సెల్ఫీ కావాలని ఏడుపులు, పెడబొబ్బలు పెట్టేలా సీన్ క్రియేట్ చేశారు.. ఆ తరవాత ఆ పాపతో అమ్మ ఒడి పథకాన్ని చంద్రబాబు సర్కార్ అమలు చేయడం లేదని విమర్శలు చేయించారు.. తీరా చూస్తే ఆ పాప వైసీపీకి చెందిన ఓ నేత కూతురు.. ఆమె ఇంటర్ నేషనల్ స్కూల్‌లో చదువుతోంది.. ఆ పాప తండ్రికి బంగారం షాప్ ఉందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.. దీంతో, ఎంతో పాజిటివ్ అనుకున్న ఈ ప్లాన్ బెడిసి కొట్టింది.. పాప వీడియో బూమరాంగ్ అయింది..
ఆ పాప వీడియోపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ అయింది.. వైసీపీ ప్రత్యర్ధులకి ఈ వీడియో ఒక వరంలా మారింది.. జగన్‌ని నియంతృత్వ, ఫ్యూడల్ పోకడలకి ఇది నిదర్శనం అని సామాజిక కార్యకర్తలు సైతం దుమ్మెత్తి పోశారు.. వైసీపీ అధినేత మనస్తత్వం ఒక ఫ్యాక్షనిస్టుని తలపిస్తోందని అభిప్రాయ పడ్డారు.. దీంతో, జగన్‌కి కలిసి వస్తుందని ఆశించిన ప్లానింగ్ గతి తప్పడంతో, దీనిపై వైసీపీ సోషల్ మీడియా కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది.. ఈ ఐడియా ఇచ్చిన ఐ ప్యాక్‌ని వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.. 2024 ఎన్నికలకు ముందు ఇలాంటి వీడియోలతోనే వైసీపీకిభారీ నష్టం జరిగిందని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు.. దీంతో, వెంటనే ఐ ప్యాక్‌కి ప్యాకప్ చేయాలని చెబుతున్నారు.. మరి, జగన్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది..