Site icon HashtagU Telugu

Sri Reddy : నటి శ్రీరెడ్డిపై కేసు పెట్టిన వైఎస్ షర్మిల

Shamrila Case

Shamrila Case

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల ..సినీ నటి , వివాదాలకు కేరాఫ్ గా నిలిచే శ్రీ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ నటి శ్రీరెడ్డి (Sri Reddy), వర్ర రవీందర్ రెడ్డి (Ravinder Reddy)తో పాటు మరికొంతమంది ఫై పిర్యాదు చేసింది. మొత్తం 8 మందిపై షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా తనను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతూ, తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు షర్మిల.

We’re now on WhatsApp. Click to Join.

తాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో ప్రజలను కలిసేందుకు ప్రచారం ప్రారంభించానని.. అయితే ఈ సందర్భంగా కొందరు దురుద్దేశంతో తనపైనా, తన సహచరులపై అసభ్య కామెంట్లు పెడుతున్నారని షర్మిల పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. నిరాధారమైన పోస్టులతో తనను అవమానిస్తున్నారని, తన గురించి కొన్ని పీడీఎఫ్ పోస్టులను సోషల్ మీడియాలో సర్క్కులేట్ చేస్తున్నారని పిర్యాదు లో పేర్కొన్నారు. షర్మిల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. దర్యాప్తు మొదలుపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలుపడం జరిగింది.

ప్రస్తుతం షర్మిల ఏపీసీసీ చీఫ్ గా తన దూకుడు కనపరుస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుండి ఎక్కడ , ఏ విషయంలోనూ తగ్గేదేలే అంటూ దూసుకవెళ్తుంది. ముఖ్యంగా తన అన్న జగన్ ను టార్గెట్ గా పెట్టుకుంది. వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతూనే , జగన్ వ్యక్తిగతంగా చేసిన మోసాలను బయటపెడుతూ వస్తుంది. దీంతో వైసీపీ శ్రేణులు షర్మిల ను టార్గెట్ చేసారు. సోషల్ మీడియా లో ఆమెపై నెగిటివ్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. అందుకే ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగింది.

Read Also : BJP Alliance With Janasena-TDP : జనసేన – టిడిపి కూటమి తో బిజెపి పొత్తు ఉందా..?