ఆస్తుల పంపకాల వివాదంలో వైసీపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Rajya Sabha MP Vijayasai Reddy) చేసిన వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ (YS Sharmila is a strong counter) ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు, మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ అబద్ధమని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా?” అని షర్మిల ప్రశ్నించారు.
“YSR మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. ఆయన రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. బంగారు బాతును ఎవరు చంపుకోరు” అని స్పష్టం చేశారు. వైస్సార్ మరణానికి చంద్రబాబు గారు కారణం అయితే, మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా?” అని షర్మిల మండిపడ్డారు. ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజాలు ఎందుకు బయట పెట్టలేదు? అని ప్రశ్నించారు. చంద్రబాబుతో నా వ్యక్తిగత సంబంధాలు లేవు. విజయసాయిరెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వ్యక్తేనని ఎద్దేవా చేశారు. జగన్ వల్ల విజయసాయిరెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా బలపడ్డారని చెప్పారు. అందువల్లే జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు.
జగన్ గారికి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?. ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్‌ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం YSR బిడ్డకు ఎన్నటికీ రాదని మాటిస్తున్నా.’ అని పేర్కొన్నారు.
Read Also : Janwada Farm House : సీఎంకు కేటీఆర్ ఫోబియా పట్టుకుంది – ఎమ్మెల్యే కేపీ వివేకానంద