Site icon HashtagU Telugu

YS Sharmila Protest : కరెంటు బిల్లు-జేబుకి చిల్లు..5 నెలలకే బాబు చుక్కలు – షర్మిల

Sharmila Gandhich

Sharmila Gandhich

ఏపీ లో కరెంట్ చార్జీల పెంపు (Current Charges Hike) అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) ఆందోళన బాట చేపట్టింది. విద్యుత్ ఛార్జీల సర్దుబాటును వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద షర్మిల ఆందోళనకు దిగారు. కరెంటు బిల్లు-జేబుకి చిల్లు, వైసీపీ పాపం- కూటమి శాపం అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘అధికారంలోకి వచ్చిన 5 నెలలకే చంద్రబాబు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇది ప్రజలకు షాక్ కాదా? వాళ్లేం పాపం చేశారు? మీకు ఓట్లు వేయడమే వారికి శాపమా?’ అని ఆమె ప్రశ్నించారు.

గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో పాపాలు జరిగితే, కూటమి ప్రభుత్వం ప్రజలపై శాపం మోపుతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.18 వేల కోట్ల సర్దుబాటు చార్జీల భారం ప్రజలపై మోపుతోందని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపు ఎన్నికల హామీలకు వ్యతిరేకమని, కూటమి ప్రభుత్వం అదనపు భారం తగ్గించడంలో విఫలమైందని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచిందని అన్నారు… కూటమి అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలు పెంచబోమన్నారు… అవసరమైతే 30 శాతం తగ్గిస్తామని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటే, అదనపు భారాన్ని ప్రజలపై మోపకూడదన్న చిత్తశుద్ధి లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, కేంద్రం నుండి అదనపు నిధులు సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read Also : Hyderabad : మెడికవర్ హాస్పటల్ లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్.!