YS Sharmila : రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్..షర్మిల ఏమన్నా చెప్పిందా..!!

ఇంత భారీ వర్షాలు , విపత్తు వస్తుందని ఎవ్వరు ఊహించలేదని..'రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్'

Published By: HashtagU Telugu Desk
Shamrila Vjd

Shamrila Vjd

రాజకీయ నేతలు అప్పుడప్పుడు సినిమా రేంజ్ డైలాగ్స్ పేల్చి వార్తల్లో నిలుస్తుంటారు..అంతే విధంగా అప్పుడప్పుడు నోరు జారడం..ఓ మాటకు మరో మాట సంబంధం లేకుండా మాట్లాడడం..కొన్ని విచిత్ర డైలాగ్స్ పలకడం వంటివి చేసి వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈరోజు షర్మిల (YS Sharmila) కూడా అలాంటి విచిత్ర డైలాగ్స్ పేల్చి నెటిజన్లకు దొరికేసింది. భారీ వర్షాలకు , వరదలకు అతలాకుతలమైన విజయవాడ – సింగ్ నగర్ లో వరద బాధితులను ఈరోజు షర్మిల పరామర్శించింది.

We’re now on WhatsApp. Click to Join.

మోకాళ్ల లోతున ఉన్న వరద నీటిలో దిగి.. ఇంటింటికీ తిరుగుతూ బాధితులకు నిత్యావసరాలు పంచి పెట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. బుడమేరు ఆక్రమణలను తొలగించాలని , తెలంగాణలో ఉన్న హైడ్రా తరహాలో వ్యవస్థ ఇక్కడ కూడా తేవాలని సూచించారు. వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం అని.. బాధితులు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి నా గుండె తరుక్కుపోయిందని తెలిపారు. ఇంత భారీ ఎత్తున విపత్తు సంభవిస్తే ప్రధాని మోదీ కనీసం స్పందించలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంత భారీ వర్షాలు , విపత్తు వస్తుందని ఎవ్వరు ఊహించలేదని..’రైనీ సీజన్ (Rainy Season) అంటేనే రైన్స్ వచ్చే సీజన్’ నొక్కి చెప్పి వార్తల్లో నిలిచింది. రైనీ సీజన్ రైన్స్ వస్తాయని మాకు తెలియదా..అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : SSMB 29 : మహేష్ 29 దసరాకైనా అప్డేట్ ఇస్తారా..?

  Last Updated: 05 Sep 2024, 12:04 AM IST