Site icon HashtagU Telugu

CM Chandrababu : ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతోంది. ఐఎండీ (భారత వాతావరణ శాఖ) ప్రకారం, మరికొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశముంది. ప్రస్తుతం ఈ అల్పపీడనం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదులుతూ, ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్లే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు తీవ్ర వాతావరణ ప్రభావం ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

Deputy CM Pawan: నేడు ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన

ఉత్తరాంధ్రపై అల్పపీడన ప్రభావం
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. విశాఖపట్నం నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కొనసాగుతుండగా, గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ కూలిపోయింది. వర్షాల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో సాధారణ జీవన విధానం అంతరాయం కలిగింది. వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అత్యవసర చర్యలపై అధికారులను దృష్టి సారించారు.

వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు అప్రమత్తత సలహాలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అధిక వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. తక్షణ సహాయం అవసరమైన చోట చర్యలు తీసుకోవాలని, పాఠశాలలకు సెలవు ప్రకటించాలని సూచించారు సీఎం చంద్రబాబు. విద్యార్థుల భద్రత దృష్ట్యా, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని సూచించారు.ఇప్పటికే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

వర్షాల కారణంగా పంటలకు కలిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులకు తక్షణ సాయం అందించాలన్నారు. పంట నష్టాల వివరాలను సేకరించి, త్వరగా పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సూచించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాబోయే రోజుల్లో వాతావరణం మరింత ప్రతికూలంగా ఉండే అవకాశముంది. వర్షాల తీవ్రతకు అనుగుణంగా సహాయక చర్యలను కొనసాగించాలని ప్రభుత్వం పేర్కొంది.

 
Car Attack : జర్మనీ క్రిస్మస్ మార్కెట్‌లో జనంపైకి కారు.. ఇద్దరి మృతి, 68 మందికి గాయాలు