Site icon HashtagU Telugu

Special Status : ఏకతాటిపైకి ఏపీ పార్టీలు.. ‘‘ప్రత్యేక హోదా’’ను సాధించే కరెక్ట్ టైం ఇదేనా ?

Special Status For Ap State

Special Status : ‘‘ప్రత్యేక హోదా’’ డిమాండ్ మరోసారి జాతీయ స్థాయిలో తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాలు ఈ వాదనను బలంగా వినిపిస్తున్నాయి. బిహార్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.  అధికార ఎన్డీయే కూటమిలో 12 ఎంపీ సీట్లతో కీలక భాగస్వామిగా ఉన్న నితీశ్ కుమార్ రాజకీయ పార్టీ జేడీయూ కూడా ఈ వాదనను బహిరంగంగానే బలంగా వినిపిస్తోంది. మరోవైపు బిహార్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడుగుతోంది. ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి  పెంచాలని అధికార జేడీయూ పార్టీని డిమాండ్ చేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

నిజంగా కేంద్రంలో కింగ్ మేకరే అయితే.. బిహార్‌కు ప్రత్యేక హోదాను సాధించి పెట్టాలని సీఎం నితీశ్ కుమార్‌కు ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ సవాల్ ఇటీవలే విసిరారు.  ఈ తరుణంలో కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిలో జేడీయూను మించిన శక్తివంతమైన పార్టీగా టీడీపీ ఉంది. టీడీపీ వద్ద 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎన్డీయే సంకీర్ణ కూటమిలో వెన్నెముకలా టీడీపీ మారింది. ఈ కీలక తరుణాన్ని సద్వినియోగం చేసుకొని ఏపీకి ప్రత్యేక హోదాను(Special Status) టీడీపీ సాధించి పెట్టాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది.

Also Read :CM Revanth: నడ్డాతో రేవంత్ భేటీ.. తెలంగాణ బకాయిలు విడుదల చేయాలంటూ!

ఇవాళ జరిగే లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని తమ నలుగురు ఎంపీలను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశించారు. అంటే ఏపీలో ప్రతిపక్షం కూడా  కొన్ని అంశాల్లో కేంద్రంలోని ఎన్డీయే కూటమితోనే కలిసి నడుస్తోంది. ఇదే అనుకూలమైన సమయమని.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కేంద్రప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రస్తుత తరుణాన్ని కీలక పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తరుణాన్ని వాడుకొని ఏపీకి ప్రత్యేక హోదాను సాధించాల్సిన అవసరం ఉందని  కోరుతున్నారు.  ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది.  రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయకత్వంలో అఖిల పక్ష బృందం వెళ్ళి ప్రధానిని కలిసి ఏపీకి ప్రత్యేక హోదాను కోరాల్సిన అవసరం ఉందని ప్రజానీకం అంటున్నారు.

Also Read :Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

మరవైపు పొరుగున ఉన్న ఒడిశాలోనూ ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన బిజూ జనతాదళ్ అధినేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ వాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండున్నర దశాబ్దాల పాటు నోరుమెదపని ఆయన.. ఇప్పుడు ప్రత్యేక హోదా వాదనను తెరపైకి తేవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version