Site icon HashtagU Telugu

Nara Lokesh: సార్ ప్లీజ్ కేసులు మాఫీ చేయరూ… మోదీ ని జగన్ కలిస్తే ఇదే అడుగుతారు.!!

Nara Lokesh2

Nara Lokesh2

టీడీపీ సీనియర్ నేత నారాలోకేశ్…సెటైర్లు వేయడంలో కాస్త డెవలప్ అయినట్లే కనిపిస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా… జగన్ మీద సెటైర్లు వేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. మొన్న మోదీ ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోదీతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఇదే అంశంపై తనదైన స్టైల్లో వ్యాంగ్యాస్త్రాలు విసిరారు లోకేష్. సార్ ప్లీజ్ నా కేసులు మాఫీ చేయరూ… అంటూ ప్రధానిని జగన్ వేడుకోవడం తప్పా… ఆయన రాష్ట్రాన్ని ఉద్దరించింది ఏమీ లేదన్నారు.

మంగళవారం ఉండవల్లిలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆర్కెను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివ్రుద్ధి జరిగింది మాత్రం శూన్యం అంటూ దుయ్యబట్టారు. అవినీతిలో, యాక్టింగ్ లో ఆర్కే చాలా బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు లోకేష్. గెలిచిన వెంటనే ఇళ్ల పట్టాలిస్తామన్న ఎమ్మెల్యే ఆర్కే…పేదల ఇళ్లను కూల్చారంటూ ఫైర్ అయ్యారు.

Also Read:  Andhra Pradesh: మరో 30ఏళ్లు మనదే అధికారం…జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే అటవీభూముల్లో నివసిస్తున్న వారికి బట్టలు పెట్టి ఇళ్ల పట్టాలు ఇస్తానంటూ హామీ ఇచ్చారు. దేవుడి మాన్యం ప్రాంతంలో రోడ్లు వేయిస్తాన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు 10వేళ ఇళ్లు నిర్మిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. కాగా త్వరలోనే లోకేశ్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఆ యాత్రపై స్పష్టత వచ్చింది. 2023జనవరి 27 నుంచి ఏపీలో తన పాదయాత్ర ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. రోడ్ మ్యాప్ పై తుది కసరత్తు జరుగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.