విశాఖలో సముద్రం (Vizag RK Beach) 400 మీ. వెనక్కి వెళ్లడం సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా తూఫాన్ ల సమయంలో..లేదా ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు సముద్రం వెనక్కు వెళ్లడమో లేదా ముందుకు రావడమో జరుగుతూ ఉంటుంది. కానీ శనివారం సాయంత్రం వైజాగ్ ఆర్కే బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లింది. ఆర్కే బీచ్ కు ప్రతి రోజూ వేలాది మంది సందర్శకులు, పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి సముద్రపు అందాలను ఆస్వాదిస్తుంటారు. అయితే తాజాగా ఇక్కడ ఓ అద్భుత దృశ్యం కనిపించింది. దాదాపు 400 మీటర్ల దూరం సముద్రంలోని నీళ్లు వెనక్కు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సముద్రం లోపలికి వెళ్లడంతో రాళ్లు, శిలలు బయటపడ్డాయి.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో సందర్శకులు ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడానికి వాతావరణ మార్పులే కారణమని సైంటిస్టులు చెపుతున్నారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడి ఇలా జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో అంటే ఈ ఏడాది జనవరిలోనూ సముద్రం వెనక్కు వెళ్లింది. అయితే ఇలా సముద్రం వెనక్కు వెళుతున్నప్పుడు పర్యాటకులు కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలలు వెంట పరిగెత్తడం చేయరాదని, సముద్ర తీర ప్రాంతాన్ని దూరం నుండే ఎంజాయ్ చేయాలని, దగ్గరకు వెళ్లకూడదని సూచిస్తున్నారు.
Read Also : Amy Jackson : పెళ్లి చేసుకున్న చరణ్ హీరోయిన్..