Site icon HashtagU Telugu

School Bus Accident : ఏపీలో మరో బస్సు ప్రమాదం ..

Ap School Bus Accident

Ap School Bus Accident

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన ఘోర ప్రమాద ఘటన వార్తల్లో నిలుస్తుండగానే మరో బస్సు ప్రమాద ఘటన ప్రజలను షాక్ లో పడేసింది. కృష్ణా జిల్లాలో ఓ పాఠశాల బస్సు పంట కాలువలో బోల్తా పడింది. స్టీరింగ్​ రాడ్​ విరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెపుతున్నారు. జిల్లాలోని అవనిగడ్డలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు.. కోడూరు మండలం, విశ్వనాథపల్లె సమీపంలో అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.

ఇక సోమవారం ఉదయం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (Vijayawada RTC Bus Stand) లో బస్సు బీభత్సం (RTC Bus Mishap) సృష్టించింది. 12 ప్లాట్ ఫామ్ ముందు ఆగాల్సిన ఓ ఏసీ బస్సు.. అదుపు తప్పి ప్లాట్ ఫామ్ పైకి దూసుకురావడంతో ప్లాట్ ఫామ్ ఫై ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. విజయవాడలోని ఆటోనగర్ డిపో (Auto Nagar Depot)కు చెందిన బస్సు గుంటూరు (Guntur)కు వెళ్లాల్సి ఉండగా 12 నెం ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, ఏడాదిన్నర చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య చనిపోయారు. మరికొందరు ప్రయాణికులకు గాయాలయినట్లు సమాచారం. ఇక ఈ బస్సు ప్రమాద ఘటన ఫై సదరు డ్రైవర్ స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

“బస్సు ఎక్సలేటర్ పట్టేసింది. దాంతో నేను రివర్స్​ గేర్​ వేశాను. బస్సు ముందుకు పోనిద్దామని మూవ్​ చేశాను. అది పట్టుకునిపోవడం వల్ల నాకు ఏం అర్థం కాలేదు. బస్సుకు ఆ సమస్య ఎప్పటినుంచో ఉందంటా.. నేను నిన్న, ఈ రోజే వచ్చాను.” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటన ఫై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. విజయవాడ బస్సు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటన పై లోతైన విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ఈ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కాలం చెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. సామాన్య ప్రజలు సర్కార్ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని.. నాలుగున్నరేళ్లుగా ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని నారా లోకేశ్ మండిపడ్డారు.

Read Also : 2023 Telangana Elections : ఎక్కడ తగ్గేదేలే అంటున్న రాజకీయ పార్టీలు

Exit mobile version